Hyper Aadi: ముంచిన వాళ్ళను వదిలేది లేదు.. భోళా శంకర్ వేదికపై హైపర్ ఆది హాట్ కామెంట్స్

సాధారణ మధ్య తరగతికి చెందిన యువకుడు ఒక యుద్ధ భూమి లోకి దిగాడు. అక్కడ కండలు తిరిగిన సైనికులు యుద్ధం చేస్తున్నారు. ఇక ఒక రోజు ఆయన యుద్ధం చేశాడు, గెలిచాడు.

Written By: Shiva, Updated On : August 7, 2023 11:26 am

Hyper Aadi

Follow us on

Hyper Aadi: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జోడిగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించిన భోళా శంకర్ మూవీ ఈ నెల 11 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీని ఆరాధించే ఆది చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ గా మారిపోయాయి.

సాధారణ మధ్య తరగతికి చెందిన యువకుడు ఒక యుద్ధ భూమి లోకి దిగాడు. అక్కడ కండలు తిరిగిన సైనికులు యుద్ధం చేస్తున్నారు. ఇక ఒక రోజు ఆయన యుద్ధం చేశాడు, గెలిచాడు. దాదాపు మూడు దశాబ్దాలు యుద్ధ భూమి ని పాలించాడు. అతడే మెగాస్టార్ చిరంజీవి. మాట్లాడే వారికి కూడా గూస్ బాంబ్స్ వస్తే.. అతడు మాట్లాడేది మెగాస్టార్ చిరంజీవి గురించి. అన్నయ్య ఎందరో సినీ సైనికులను తయారుచేస్తే.. తమ్ముడు జనసైనికులను తయారు చేస్తున్నారు.

కొన్ని యూట్యూబ్ చానల్స్ హీరో ఉదయ్ కిరణ్, సుమన్ లను పేర్లను చెబుతూ అడ్డుగోలు వీడియోలతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. దమ్ముంటే కష్టపడి సంపాదించుకోండి, కానీ ఇలా చేసి కాదు. ఎందరో హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ మెగాస్టార్ కు హీరో లే ఫ్యాన్స్. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు కానీ, ప్రతి ఇంటిలో మెగాస్టార్ ఫ్యాన్ మాత్రం కచ్చితంగా ఉంటారు. ఆయన ఆస్తుల కంటే అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నాడు.

కొంతమంది అన్నయ్య ను పొగిడి, తమ్ముడిని తిడుతుంటారు. ఒకసారి సెట్ లో చిరంజీవి గారితో మాట్లాడుతూ పాలిటిక్స్ విషయం వస్తే, నేను న్యూస్ చూడటం లేదు. నా తమ్ముడిని తిడుతుంటే.. నేను సహించ లేకపోతున్నాను అంటూ ఆయన చెప్పాడు. చిరంజీవి మంచి మనిషి కాబట్టి ముంచిన వాళ్ళ ను మన్నించాడు. కానీ తమ్ముడు సామాన్యుడు కాడు. అన్ని లెక్కలు తెలుస్తాడు. అందరికీ వడ్డీతో సహా తిరిగి ఇస్తారు, అందులో సందేహం లేదు.

టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. అలాగే అన్నయ్య గురించి తమ్ముడు గురించి మాట్లాడే స్థాయి అతనికి లేదు. కానీ చిన్న పెగ్ వేసినప్పుడు అన్నయ్య గురించి, పెద్ద పెగ్ వేసినప్పుడు తమ్ముడి గురించి కామెంట్స్ చేస్తుంటాడు. వాళ్ళకి చెప్తున్నా అర్థం లేని మాటలకూ క్లాప్స్ పడవు. అర్థం లేని సినిమాలకు కలెక్షన్స్ రావు అంటూ ఇన్ డైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మని టార్గెట్ చేశాడు ఆది.