బీచ్‌ రోడ్డు బిల్డింగుల పని అయిపోయినట్లే..!

ఏపీలోని కోస్తా తీర ప్రాంతంలో సముద్రాల దగ్గరలో భారీ బిల్డింగులు చేపట్టరాదని సీఆర్‌‌జెడ్‌ నిబంధనలు ఉన్నాయి. అయితే.. కొందరు మాత్రం రాజకీయ పలుకుబడితో వాటికి నీళ్లొదులుతున్నారు. దీంతో అడ్డగోలు నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇందులో ప్రముఖుల ఇళ్లే చాలా వరకు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఎంజాయ్‌ చేస్తున్నారు. Also Read: అప్పుడే అన్ని అనుమానాలెందుకు..? ఇప్పుడు ఆ నిర్మాణాలకు చరమ గీతం పాడేందుకు వైసీపీ సర్కార్ రెడీ అయిపోయింది. కోస్తా రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వచ్చే భవనాలు, […]

Written By: Srinivas, Updated On : January 20, 2021 2:46 pm
Follow us on


ఏపీలోని కోస్తా తీర ప్రాంతంలో సముద్రాల దగ్గరలో భారీ బిల్డింగులు చేపట్టరాదని సీఆర్‌‌జెడ్‌ నిబంధనలు ఉన్నాయి. అయితే.. కొందరు మాత్రం రాజకీయ పలుకుబడితో వాటికి నీళ్లొదులుతున్నారు. దీంతో అడ్డగోలు నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇందులో ప్రముఖుల ఇళ్లే చాలా వరకు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Also Read: అప్పుడే అన్ని అనుమానాలెందుకు..?

ఇప్పుడు ఆ నిర్మాణాలకు చరమ గీతం పాడేందుకు వైసీపీ సర్కార్ రెడీ అయిపోయింది. కోస్తా రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వచ్చే భవనాలు, ఇతర నిర్మాణాలు ఎంతటి పెద్ద వారివైనా అక్రమమని ప్రభుత్వం అంటోంది. ఒక్క వేటుతో వాటి పని పట్టేందుకు కూడా రెడీ అవుతోంది. ఈ దెబ్బతో విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న బిల్డింగులకు మూడినట్లే అనిపిస్తోంది.

Also Read: ఎక్కడున్న చోట అక్కడే కృష్ణా బోర్డు

తాజగా ఒక ప్రముఖ హోటల్ మీద జీవీఎంసీ అధికారులు గునపం దించేశారు. దాంతో ఇక తమ సంగతేంటని కూడా మిగిలిన వారిలో టెన్షన్ ఒక్కసారిగా మొదలైంది. మొత్తం మీద బీచ్ రోడ్డులో సీఆర్‌‌జెడ్‌ చట్టం పటిష్టంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది విశాఖ రాజకీయాల్లో సరి కొత్త సీన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఇదే ఖచ్చితంగా అమలైతే బహుళ అంతస్తుల బిల్డింగ్‌లన్నీ నేలమట్టం అయ్యే ప్రమాదమే ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్