https://oktelugu.com/

ఎల్ఆర్ఎస్ పై హైకోర్టు సంచలన నిర్ణయం

తెలంగాణలో భూములపై ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ విధించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన వైనంపై చాలా విమర్శలు వచ్చాయి. తెలంగాణసర్కార్ పై జనం ఈసడించుకొని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితానికి సైతం దారితీసింది. Also Read: ఇక మిగిలింది హైకోర్టు తీర్పే: ఎన్నికలు ఉండేనా..? అయితే చాలా మంది ఈ కొత్త పన్నులపై తెలంగాణ హైకోర్టుకు ఎక్కారు. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు విచారణ జరిగింది. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 20, 2021 / 02:45 PM IST
    Follow us on

    తెలంగాణలో భూములపై ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ విధించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన వైనంపై చాలా విమర్శలు వచ్చాయి. తెలంగాణసర్కార్ పై జనం ఈసడించుకొని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితానికి సైతం దారితీసింది.

    Also Read: ఇక మిగిలింది హైకోర్టు తీర్పే: ఎన్నికలు ఉండేనా..?

    అయితే చాలా మంది ఈ కొత్త పన్నులపై తెలంగాణ హైకోర్టుకు ఎక్కారు. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు విచారణ జరిగింది. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

    ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

    రాష్ట్ర ప్రభుత్వం 2016లో బీఆర్ఎస్ పతకం తీసుకొచ్చింది. ఇటీవల ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు ఆహ్వానించింది. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

    Also Read: తెలంగాణలో ఇంటర్‌‌ ఎగ్జామ్స్‌ ఎప్పుడంటే..?

    ఎల్ఆర్ఎస్ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు.

    ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఏపీ హైకోర్టులో విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్