https://oktelugu.com/

బిగ్‌ డే..: ఇక జో బైడెన్‌ శకం

సాయంత్రం సూర్యస్తమయం కాగానే.. ఉదయాన్నే ఉదయిస్తూ ఉంటాడు. ఇప్పుడు అమెరికా ప్రజల పరిస్థితీ అలానే ఉందట. ఇన్నాళ్లు చీకటి పాలనను చూశామని.. ఇప్పుడు కొత్త సూర్యుడు తమ దేశాన్ని పాలించబోతున్నాడని పలువురి అభిప్రాయం. ఎట్టకేలకు డొనాల్డ్ ట్రంప్ పాలన ముగిసింది. ఈ రోజు నుంచి అమెరికాలో కొత్త అధ్యక్షుడి పాలన మొదలుకాబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు (ఇండియన్ టైమ్ రాత్రి 10.30) అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. వాషింగ్టన్ లోని […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 20, 2021 / 03:23 PM IST
    Follow us on


    సాయంత్రం సూర్యస్తమయం కాగానే.. ఉదయాన్నే ఉదయిస్తూ ఉంటాడు. ఇప్పుడు అమెరికా ప్రజల పరిస్థితీ అలానే ఉందట. ఇన్నాళ్లు చీకటి పాలనను చూశామని.. ఇప్పుడు కొత్త సూర్యుడు తమ దేశాన్ని పాలించబోతున్నాడని పలువురి అభిప్రాయం. ఎట్టకేలకు డొనాల్డ్ ట్రంప్ పాలన ముగిసింది. ఈ రోజు నుంచి అమెరికాలో కొత్త అధ్యక్షుడి పాలన మొదలుకాబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు (ఇండియన్ టైమ్ రాత్రి 10.30) అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బైడెన్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

    Also Read: బీచ్‌ రోడ్డు బిల్డింగుల పని అయిపోయినట్లే..!

    జో బైడెన్‌ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా సేవలు అందించబోతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా ఆయన వైట్ హౌజ్‌కు చేరుకొని తన పనులు మొదలుపెడతారు. ఇప్పటికే పాత అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌజ్ ఖాళీ చేశారు. సంప్రదాయం ప్రకారం బైడెన్ ప్రమాణస్వీకారానికి ట్రంప్ హాజరుకావాలి. కానీ.. రెబల్‌గా పేరుపొందిన ట్రంప్ ఈ కార్యక్రమానికి రావడం లేదు. నేరుగా తన సామాన్లతో ఫ్లోరిడా వెళ్లిపోతున్నారు.

    అయితే.. ఆనవాయితీ ప్రకారం అధ్యక్షుడి కంటే ముందే ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా నటుడు టామ్ హ్యాంక్స్ తో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేశారు. లేడీ సింగర్ గగా జాతీయగీతం ఆలపించనుంది. జెన్నిఫర్ లోపెజ్ తో ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.

    Also Read: ఎల్ఆర్ఎస్ పై హైకోర్టు సంచలన నిర్ణయం

    అమెరికాలో ఎన్నికల ప్రక్రియ మొదలుకొని, అధికారాల బదలాయింపు వరకు ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలనాలు. తన ఓటమిని ట్రంప్ అంగీకరించలేదు. ఒక దశలో వైట్ హౌజ్ లోకి ప్రత్యేక దళాలు ప్రవేశించి, ట్రంప్ ను ఖాళీ చేయించి ఇంటికి పంపిచేస్తాయనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. మరోవైపు క్యాపిటల్ హిల్ పై ట్రంప్ అభిమానులు దాడిచేసిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇంకోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికన్ సమాజాన్ని రెండుగా విడగొట్టాయి. ఇలాంటి ఎన్నో వివాదాల మధ్య అమెరికాలో కొత్త రాజకీయ శకం మొదలైంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు