Homeఆంధ్రప్రదేశ్‌TDP On India Alliance: ఇండియా కూటమి వైపు తెలుగుదేశం?

TDP On India Alliance: ఇండియా కూటమి వైపు తెలుగుదేశం?

TDP On India Alliance: తెలుగుదేశం పార్టీది సుదీర్ఘ చరిత్ర. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించిన ఏకైక పార్టీ. దేశంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచింది. జాతీయస్థాయిలో సైతం కీలక పాత్ర పోషించింది. కూటమి ప్రభుత్వాలకు నాయకత్వం వహించింది. అటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయాలన్న డిఫెన్స్ లో ఉంది. ఎన్డీఏ వైపు వెళ్లాలా? ఇండియా కూటమి వైపు వెళ్లాలా? అన్న మీమాంస లో ఉంది.

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఆయనను ఇండియా కుటుంబం వైపు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా స్పందించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శలు చేశారు. అయితే ఆ స్థాయిలో బిజెపి నుంచి కానీ, ఎన్డీఏ నుంచి కానీ స్పందన లేదు. ముఖ్యంగా బిజెపి కేంద్ర నాయకత్వం నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, పురందేశ్వరి వంటి నాయకులే మాట్లాడారు.

కేవలం ఇండియా కూటమి నేతలు స్పందించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. త్వరలో తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో ఉండే వారంతా అవినీతి చేయడం, పంచుకోవడం అలవాటు పడిన నాయకులని కామెంట్స్ చేస్తూ ట్విట్ చేశారు. తద్వారా కీలక రాజకీయ పరిణామాన్ని తన ట్విట్ ద్వారా తెలియజేశారు. టిడిపి వేరే ఆలోచనతో ఉందని వెల్లడించేలా విజయసాయి రెడ్డి కామెంట్స్ ఉన్నాయి.

మరోవైపు లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటివరకు బిజెపి ఆగ్రనేతలను ఆయన కలుసుకోలేకపోయారు. అమిత్ షా ను కలవనున్నట్లు ప్రచారం జరిగినా.. ఇంతవరకు కలవలేదు. అమిత్ షా హైదరాబాద్ వచ్చేశారు. రెండు రోజులు పాటు ఇక్కడే ఉంటారు. 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అమిత్ షా బిజీగా మారడంతో లోకేష్ కలిసేందుకు అవకాశం లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీఏకు వ్యతిరేక మీడియాగా ముద్రపడిన కొన్ని నేషనల్ ఛానళ్లకు లోకేష్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో సదరు మీడియా సంస్థలు శ్రద్ధ చూపుతున్నాయి. ఈ పరిణామాలన్నీ టిడిపి ఇండియా కూటమి వైపు అడుగులేస్తున్నట్లు సంకేతాలిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Jogi Rajeev

Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో వైరల్..

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు...
Pakistan Democracy

Pakistan Democracy: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగు.. – రాజ్యాంగ సవరణతో అధికారాలు పాక్ ఆర్మీ చీఫ్ కు..

Pakistan Democracy: పాకిస్తాన్‌ చరిత్రలో సైన్యం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇటీవలి రాజ్యాంగ సవరణలు, ముఖ్యంగా 27వ సవరణ, ఆ ఆధిపత్యాన్ని మరింత అధికారికం, కేంద్రీకృతం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు...

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Oktelugu Epaper