Kalki 2898 Leaks: భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా లీకుల బాధ తప్పడం లేదు. ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీ సాంగ్ లీకైంది. అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దర్శకుడు శంకర్ అందుకు కారణమైన వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ప్రభాస్ రాజా డీలక్స్ చిత్రం నుండి ఓ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. హీరోయిన్ మాళవిక మోహనన్ ఫైట్ చేస్తున్న సన్నివేశం అది. ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు కారం, పుష్పతో పాటు పలు పెద్ద చిత్రాల కీలక విషయాలు లీక్ అవుతున్నాయి.
ఇటీవల ప్రభాస్ కల్కి 2898 AD చిత్రం నుండి ఒక స్టిల్ బయటకు వచ్చింది. దీనిపై చిత్ర యూనిట్ సీరియస్ గా ఉన్నారట. లీగల్ యాక్షన్ తీసుకుంటే కానీ ఇలాంటి లీక్స్ నియంత్రించగలం అని భావిస్తున్నారట. అది ఎక్కడ నుండి లీక్ అయ్యిందో దర్శకుడు నాగ్ అశ్విన్ గుర్తించారట. కల్కి చిత్ర విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న సంస్థ ఎంప్లాయ్ ఒకరు దీనికి పాల్పడ్డారని సమాచారం. ఆ వ్యక్తిని ఇప్పటికే ఆ సంస్థ ఉద్యోగం నుండి తొలగించిందట. అయినా సదరు సంస్థ నుండి భారీ పరిహారం కోరుతూ న్యాయపోరాటం చేయాలని నిర్మాతలు నిర్ణయించారట.
కల్కి చిత్ర లీగల్ టీమ్ దీనిపై పని చేస్తున్నారని అంటున్నారు. ఇక కల్కి 80 శాతం వరకు షూటింగ్ జరుపుకున్నట్లు సమాచారం, కమల్ హాసన్-ప్రభాస్ కాంబినేషన్ సీన్స్, అమితాబ్-దీపికా పదుకొనె మీద కొన్ని సీన్స్ తెరకెక్కించాల్సి ఉందట. మరోవైపు ప్రభాస్ కి మోకాలి సర్జరీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుంది.
అలాగే కల్కి రెండు భాగాలుగా రానుందట. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో టెర్మినేటర్ చిత్రాన్ని పోలిక కథ అంటున్నారు. కమల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారని తెలుస్తున్న నేపథ్యంలో అతన్ని ఎదిరించేందుకు ప్రభాస్ భవిష్యత్తు లోకి వెళతాడట. ప్రథమ భాగంలో కమల్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట. పార్ట్ 2లో మాత్రం కమల్, ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ మైండ్ బ్లాక్ చేయనున్నాయట. ఈ చిత్రంలో దిశా పటాని మరొక హీరోయిన్ గా నటిస్తుంది. అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు.