ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి తెలుగుదేశం పార్టీకి ఎల్.రమణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి చేపట్టిన నియామకాల్లోనూ ఎల్.రమణకే చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇక్కడ పార్టీని నమ్మేస్థితిలో కూడా ప్రజలు లేరు.
Also Read: కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడా?
మరికొద్ది రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడి ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవల ఆకస్మికంగా చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికతో ఇప్పటికే రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ రామలింగారెడ్డి భార్య సుజాతకే టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ దుబ్బాక ఎన్నికల్లో టీడీపీ స్టంట్ ఎలా ఉండబోతోంది..? ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతోంది..? అనేది ఇప్పటి వరకు ప్రశ్న. అయితే.. తాజాగా మూడో సారి అధ్యక్షుడిగా నియమితుడైన ఎల్.రమణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. దుబ్బాక ఉప ఎన్నికలో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీతో 2018 అసెంబ్లీ ఎన్నికల వరకే పొత్తు పరిమితమని ప్రకటించాడు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ పోటీ చేస్తుందన్నాడు.
Also Read: వారానికి మేల్కొన్న జగన్, కేసీఆర్?
2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్ పుట్టిమునిగిందనే అభిప్రాయాలు ఆ పార్టీలో వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలంగాణకు అడ్డుపడిన చంద్రబాబు వచ్చి ప్రచారం చేయడంతో అది పెద్ద మైనస్ అయింది. చంద్రబాబు ప్రచార అంశాన్నే ఎత్తుకొని కేసీఆర్ తన ప్రచారాన్ని కొనసాగించాడు. అందుకే.. కాంగ్రెస్ కూడా ఈ దుబ్బాక ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధపడింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More