https://oktelugu.com/

టీడీపీ ఆన్‌ ఫైర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గతంలో కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి. అధికారంలో వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో టీడీపీపై దూకుడు ప్రదర్శించిన వైసీపీ కాస్త ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచడమే కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలోనూ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన స్పీకర్‌‌ పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ నిరసన తెలిపినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముందుండే వారు. ప్రస్తుతం బాబే రంగంలోకి దిగుతుండడంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 3, 2020 4:29 pm
    Follow us on

    Chandrababu in Assembly
    ఏపీ అసెంబ్లీ సమావేశాలు గతంలో కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి. అధికారంలో వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో టీడీపీపై దూకుడు ప్రదర్శించిన వైసీపీ కాస్త ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచడమే కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలోనూ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన స్పీకర్‌‌ పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ నిరసన తెలిపినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముందుండే వారు. ప్రస్తుతం బాబే రంగంలోకి దిగుతుండడంతో పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు.

    Also Read: వేడి పుట్టిస్తున్న అసెంబ్లీ సమావేశాలు

    19 మందితోనూ..

    ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే టీడీపీకి కేవలం 23 మంది ఉన్నారు. అందులోనూ నలుగురు వైసీపీకే మద్దతిస్తున్నారు. అంటే మిగిలింది 19 మంది. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ వీరిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈసారి మాత్రం టీడీపీ పైర్‌‌ చూపెడుతోంది. చంద్రబాబు నాయుడు 19 మంది సభ్యులతోనే ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రైతు సమస్యలు, పోలవరం వంటి విషయాల్లో జరిగిన చర్చలో ఇది స్పష్టం కనిపించింది.

    ఫాంలోకి వచ్చిన బాబు

    గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఏం అంశంపైన మాట్లాడినా అధికార పక్షం అడ్డుకునేది. దీంతో ఆయన కూడా సీనియర్‌‌ సభ్యులైన అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి లాంటి వారితో మాట్లాడించేవారు. ఈసారి మాత్రం స్వయంగా చంద్రబాబే అన్నితానై వ్యవహరిస్తున్నారు. ప్రతి టాపిక్‌లోనూ స్పీకర్‌ను మైక్‌ అడిగి మరీ చెలరిగేపోతున్నారు.

    Also Read: తలైవా న్యూయర్ గిప్ట్.. ఎన్నికల్లో పోటీకి సై అంటున్న రజనీ..!

    అక్కడా జగనే..

    ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సీఎం స్పందించాల్సిన అవసరం ఉండదు. సంబంధిత మంత్రి లేదా ఇతర ఎమ్మెల్యేలు సమాధానం ఆన్సర్‌‌ ఇస్తుంటారు. ఈ సారి పరిస్థితి అలా లేదు. ఇటు వైపు నుంచి చంద్రబాబే మాట్లాడుతుండడంతో అటు నుంచి నేరుగా సీఎం జగన్‌ సమాధానం ఇస్తున్నారు. ప్రతి అంశంపైనా చంద్రబాబే మాట్లాడుతుండడంతో ఆయన జనాల్లోకి ఎక్కువ ఫోకస్‌ అవుతుండడంతో జగన్‌ స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్