ఏపీ అసెంబ్లీ సమావేశాలు చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య పలు అంశాలపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అనేక అంశాల్లో వైసీపీ, టీడీపీనేతల మధ్య ఆరోపణలు, విమర్శలతో సభ దద్దరిల్లుతోంది. సభలో గందరగోళం సృష్టించడంతో వరుసగా మూడు రోజులపాటు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. నాలుగోరోజూ కూడా సభ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే సస్పెన్షన్ తప్పేలా లేదు.
Also Read: జగన్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటో..?
కీలక బిల్లులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం పలు కీలక అంశాలపై చర్చించారు. అజెండాలోని మూడు అంశాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరపాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించడంతో అందుకుఅనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లు, నగదు బదిలీ, కరోనా కట్టడితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై సభలో చర్చించారు. శాసన మండలిలో పోలవరం ప్రాజెక్టు, ఉద్యోగుల సంక్షేమం, శాంతిభద్రతలు సహా 9 బిల్లులపై చర్చ జరుగుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్