https://oktelugu.com/

మామ సీటు కోసం అల్లుడి వేషాలు..!

మామ సీటు కోసం అల్లుడు వేషాలు వేస్తూ ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. మామకు తగ్గ అల్లుడిగా పేరుతెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. దివంగత ఎంపీ, సినీనటుడు శివప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు చిన్ననాటి స్నేహితుడు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో శివప్రసాద్ టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేశాడు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా శివప్రసాద్ గెలుపొందారు. స్వతహాగా ఆయన సినీనటుడు కావడంతో ప్రజా సమస్యలపై ఆయన వేషాలు వేస్తూ అలరించేవారు. Also Read: సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 9:21 pm
    Follow us on


    మామ సీటు కోసం అల్లుడు వేషాలు వేస్తూ ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. మామకు తగ్గ అల్లుడిగా పేరుతెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. దివంగత ఎంపీ, సినీనటుడు శివప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు చిన్ననాటి స్నేహితుడు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో శివప్రసాద్ టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేశాడు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా శివప్రసాద్ గెలుపొందారు. స్వతహాగా ఆయన సినీనటుడు కావడంతో ప్రజా సమస్యలపై ఆయన వేషాలు వేస్తూ అలరించేవారు.

    Also Read: సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?

    రాష్ట్ర విభజన సమయంలోనూ ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ ఆవరణంలో పలురకాల వేషాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఢిల్లీ పెద్దలతోపాటు దేశ ప్రజలందరినీ ఆయన రకరకాల వేషాలతో తనవైపు తిప్పుకున్నాడు. అయితే కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గాలి వీయడంతో శివప్రసాద్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆయనలా వేషాలు వేసి ప్రజా సమస్యలపై స్పందించేవారు టీడీపీలో కరువయ్యారు.

    ఇక శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ కూడా మామ బాటలోనే నడుస్తున్నాడు. 2019లో కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ ప్రజల్లోనే నిత్యం ఉంటున్నాడు. ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇటీవల జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నరసింహ ప్రసాద్ తుగ్లక్ వేషంవేసి అందరినీ ఆకట్టుకున్నాడు. టీడీపీ ఆయన మామలేని లోటును ప్రస్తుతం ఆయన అల్లుడు భర్తీ చేస్తున్నాడనే టాక్ టీడీపీ శ్రేణుల్లో విన్పిస్తుంది.

    Also Read: ఏపీలో రూ.200కోట్ల వసూళ్ల కలకలం?

    ఇకపోతే గతంలో ఆయన మామ మరణంతో ఖాళీగా అయిన స్థానాన్ని తాను భర్తీ చేయాలని నరసింహ ప్రసాద్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి రైల్వే కొడూరులో ఉంటున్నప్పటికీ చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జి నియమించకపోవడంతో తనకు ఆ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నాడట. వచ్చే ఎన్నికల నాటికి చిత్తూరు పార్లమెంట్ నుంచి బరిలో దిగితే తనకు అన్నివిధలా కలిసి వస్తుందని భావిస్తున్నాడు. మామ సీటు కోసం వేషాలు వేస్తున్న నరసింహ ప్రసాద్ ను చంద్రబాబు ఎంతవరకు గుర్తిస్తారో చూడాలి..!