ఏపీ రాజకీయాల్లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నర్సాపురం ఎంపీగా పోటీచేసి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే ఆ వ్యవహారం రోజురోజుకు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీలోనే వైరిపక్షంగా వ్యవహరిస్తుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సదరు ఎంపీకి షాకిచ్చిందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలంతా లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు.
Also Read: ఏపీలో రూ.200కోట్ల వసూళ్ల కలకలం?
అయితే రఘురామ కృష్ణంరాజు కూడా వైసీపీ ఎంపీలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. వైసీపీ అధిష్టానం తీసుకునే చర్యలకు ధీటుగానే బదులిస్తున్నాడు. దీంతో అతడి విషయంలో తాడోపెడో తేల్చుకునేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారట. ఈమేరకు రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారనే టాక్ పొలికల్ సర్కిల్స్ లో విన్పిస్తోంది.
దీంతో రఘురామ కృష్ణంరాజు బయటికి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రఘురామ కృష్ణంరాజు అడుగులు సైతం బీజేపీ వైపు పడుతున్నాయి. దీంతో నర్సాపురం ఎంపీ సీటును ఎవరీతో భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా టీడీపీ చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వైసీపీలోకి వస్తే ఆ సీటును ఆయనకే ఇస్తారనే ప్రచారం వైసీపీలో జరిగింది. అయితే ప్రస్తుతం వైసీపీకి చెందిన సినీనటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్విరాజ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
Also Read:: సోషల్ మీడియాలోనే తెలుగు తమ్ముళ్ల ఆరాటం..!
తాజాగా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తనకు నర్సాపురం ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతానని అన్నారు. ఆయన తనకు ఆ సీటు కేటాయిస్తే రఘురామ కృష్ణంరాజుపై గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. తాను పార్టీకి విధేయుడిగా ఉంటానని.. రఘురామ కృష్ణంరాజు ద్రోహం చేయనంటూ ఘాటుగా స్పందించారు. నర్సాపురంలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో పృథ్వీరాజ్ ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు సై అంటున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజ్ కు ఛాన్స్ ఇస్తారా? లేదో వేచి చూడాల్సిందే..!