https://oktelugu.com/

గవర్నర్ వద్దకు చేరిన బిల్లుల పంచాయతీ..

వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల విషయం ఓ కోలిక్కి వచ్చే సమయం ఆసన్నమయ్యింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇందుకు చట్టపరంగా అవకాశం కల్పించే బిల్లులకు ఆమోదం లభించే సమయం వచ్చిందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వానికి చట్ట పరంగా అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరానికి సచివాలయం, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 9:40 pm
    Follow us on


    వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల విషయం ఓ కోలిక్కి వచ్చే సమయం ఆసన్నమయ్యింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇందుకు చట్టపరంగా అవకాశం కల్పించే బిల్లులకు ఆమోదం లభించే సమయం వచ్చిందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వానికి చట్ట పరంగా అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరానికి సచివాలయం, సిఎంఓ తలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. శాశ్వత భవనాల నిర్మాణం కోసం సిఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, నిర్మాణ రంగా నిపుణులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన విషయం విధితమే.

    Also Read: ఆ నేతలకు త్వరలో జగన్ ‘స్పెషల్ క్లాస్’..!

    శాసన మండలికి రెండవ సారి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను జులై నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పంపింది. అయితే ఈ బిల్లులు చర్చకు రాకుండానే శాసన మండలి నిరవదికంగా వాయిదా పడింది. శాసనసభలో ఈ రెండు బిల్లులకు ఆమోదం లభించింది. రెండవ సారి శానస మండలికి పంపినా బిల్లు ఆమోదించడం, వ్యతిరేకించడం గాని చేయకుండా మండలి నిరవదిక వాయిదా పడటడంతో 30 రోజుల అనంతరం ఆ బిల్లు శాసన మండలి ఆమోదించినట్లుగా భావించి గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఆయన ఆమోదం లభిస్తే ఆ బిల్లులు చట్ట రూపాన్ని దాల్చుతాయి. ద్రవ్య వినియమ బిల్లుకు ఇదే విధానంలో ఆమోదం లభించింది. మొదటి సారి సభకు వెళ్లడంతో 14 రోజుల అనంతరం శాసన మండలి ఆమోదించినట్లుగా భావించి ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం పొందింది.

    Also Read: సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?

    రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా అనేక చిక్కులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ బిల్లుల ఆమోదంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆమోదించిన గవర్నర్ ఈ విషయంలో విపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి సొంత పార్టీ బీజేపీ నేతలు గవర్నర్ తీరును విమర్శించారు. మరొవైపు హైకోర్టు ఈ ఆర్డినెన్స్ ను రద్దు చేసింది. మరొవైపు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపైనా టిడిపి ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో గవర్నర్ పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులను ఆమోదిస్తారా లేక వెనక్కి పంపుతారా అనే విషయంలో ఆశక్తి నెలకొంది. గవర్నర్ న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

    మరోవైపు బీజేపీ ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే మూడు రాజధానులను వ్యతిరేకిస్తోంది. రాజధాని రైతుల చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలిపారు. దీంతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయం కత్తిమీద సాము అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం ఏపీ పునర్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని ప్రముఖ న్యాయవాది జంద్యాల రవిశకంర్ పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన పునర్యవవస్థీకరణ చట్టంలో ఒక్క రాజధానికే అవకాశం ఇచ్చారని, మూడు రాజధానులకు ఏర్పాటు చేయాలంటే ఈ చట్టానికి సవరణ చేయాలని ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. కీలకంగా మారిన ఈ బిల్లులపై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు.