అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్..!

ఇఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన కార్మిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత కె. అచ్చెన్నాయుడుకి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుణ్ని విజయవాడ తీసుకువచ్చిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు ఉదయం మంగళగిరిలోని ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఏసీబీ అధికారులు సమర్పించిన వివరాలు పరిశీలించిన అనంతరం […]

Written By: Neelambaram, Updated On : June 13, 2020 11:58 am
Follow us on


ఇఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన కార్మిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత కె. అచ్చెన్నాయుడుకి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుణ్ని విజయవాడ తీసుకువచ్చిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఈ రోజు ఉదయం మంగళగిరిలోని ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట హాజరు పరిచారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ఏసీబీ అధికారులు సమర్పించిన వివరాలు పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ లకు 14 రోజుల రిమాండ్ విధించారు. అచ్చెన్నాయుణ్ని తొలుత విజయవాడ సెంట్రల్ జైల్ కు తరలించి, ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జిజిహెచ్)కి తరలించారు. మరో నిందితుడు రమేష్ కుమార్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఇఎస్ఐ స్కామ్ లో సంభందిత ఆసుపత్రులకు మందులు, పరికరాల కొనుగోలు, టెలీ మెడిసిన్ స్కీంలో ఏజన్సీలకు అయినకాడికి నిధులు దోచి పెట్టారనే కారణంతో ఏసీబీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ లను నిన్న అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో రూ. 150 కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ తేల్చింది.