కాంగ్రెస్ లో కాకరేపుతున్న సీనియర్ నేతల రహస్య భేటి?

తెలంగాణలో పీసీసీ మార్పుకు తథ్యమని తేలడంతో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పీసీసీ పదవీపై గంప్పెడశలు పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా పీసీసీ పదవీని దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే పీసీసీ రేసులో ఉన్న ఇద్దరు నేతలు రహస్య భేటీకి సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పీసీసీపై తమ నిర్ణయం కోరితే ఎలా స్పందించాలనే దానిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ నియామకం […]

Written By: Neelambaram, Updated On : June 13, 2020 11:49 am
Follow us on


తెలంగాణలో పీసీసీ మార్పుకు తథ్యమని తేలడంతో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పీసీసీ పదవీపై గంప్పెడశలు పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా పీసీసీ పదవీని దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే పీసీసీ రేసులో ఉన్న ఇద్దరు నేతలు రహస్య భేటీకి సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పీసీసీపై తమ నిర్ణయం కోరితే ఎలా స్పందించాలనే దానిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

పీసీసీ నియామకం అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని నేతలు మీడియా ముఖంగా చెబుతున్నప్పటికీ తెరవెనుక మంతనాలు సాగిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు తమనే పీసీసీగా నియమించాలని కోరిన సంగతి తెల్సిందే. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పీసీసీ ఇస్తే సహించేది లేదని పలుమార్లు ప్రకటించారు. దీంతో పీసీసీ పదవీకి రేవంత్ రెడ్డి పేరు ఖారారైందని వార్తలు వచ్చాయి. అయితే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు.

ఇదిలా ఉంటే పీసీసీ రేసులో మల్లు భట్టి విక్రమార్క, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, వీహెచ్, రేవంత్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. ప్రముఖంగా రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. అయితే రేసులో కొంచెం వెనుకబడిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిలు రహస్య భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ మార్పుపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పీసీసీ పదవీ కోసం ఎవరికీ వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఒకవేళ పీసీసీ తమకు దక్కకుంటే తమకు అనుకూలంగా ఉండేవారైనా ఆ పదవీలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది.

ఇప్పటికీ పీపీసీ నియామకంపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ కే పీసీసీ కట్టబెట్టేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నాడని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో రేవంత్ వ్యతిరేక వర్గం రహస్య భేటి అవడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డికి పీసీసీ దక్కకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ లో మళ్లీ గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కొత్త పీసీసీనీ వీలైనంత త్వరగా ప్రకటించాలని కోరుతున్నారు.