Homeజాతీయ వార్తలుTamil Nadu Elections 2026: సూటిగా సుత్తి లేకుండా.. తమిళనాడులో గెలిచేది ఎవరో ఈమె చెప్పేసింది..

Tamil Nadu Elections 2026: సూటిగా సుత్తి లేకుండా.. తమిళనాడులో గెలిచేది ఎవరో ఈమె చెప్పేసింది..

Tamil Nadu Elections 2026: తమిళనాడులో రాజకీయాలు చాలా వింతగా ఉంటాయి. అక్కడ కులాలు.. మతాలు.. జాతుల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అది స్థాయి దాటిపోయి మనుషులు అనే విషయాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. అందువల్లే తమిళనాడు రాజకీయాలను దక్షిణాదిలో.. యావత్ భారతావనిలో ప్రత్యేకంగా చూస్తుంటారు. Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా.. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. […]

Tamil Nadu Elections 2026: తమిళనాడులో రాజకీయాలు చాలా వింతగా ఉంటాయి. అక్కడ కులాలు.. మతాలు.. జాతుల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అది స్థాయి దాటిపోయి మనుషులు అనే విషయాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. అందువల్లే తమిళనాడు రాజకీయాలను దక్షిణాదిలో.. యావత్ భారతావనిలో ప్రత్యేకంగా చూస్తుంటారు.

Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా..

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి అధికార డిఎంకె, ప్రతిపక్ష అన్నా డిఎంకె, విజయ్ టివికే పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. పోటాపోటీగా ఉచిత హామీలు ఇస్తున్నాయి. ఒక రకంగా ఓటర్లపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలలో ఇటువంటి వరాలు ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో టీవీలను.. మిక్సీలను.. గ్రైండర్లను.. సైకిళ్లను అక్కడి ప్రజలకు అందించిన చరిత్ర రాజకీయ పార్టీలకు ఉంది.

ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఒక్కో సర్వే సంస్థ ఒక్కో విధంగా ఫలితాలను చెబుతోంది. తనకు అనుకూలమైన రాజకీయ పార్టీకి.. ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఫలితాలను అంచనా వేస్తోంది. అయితే ఇక్కడే ఓ మహిళా జర్నలిస్ట్ చేసిన ప్రయోగం తమిళ రాజకీయాలస్థితిగతులను పూర్తిగా తెలియజేస్తోంది.

అక్షిత నందగోపాల్ అనే ఓ మహిళా జర్నలిస్టు ఇండియా టీవీలో సీనియర్ ఎడిటర్. పైగా ఆమె యాంకర్ కూడా. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రతిరోజు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆమె ప్రతిరోజు న్యూట్రల్ ఓటర్లను అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఆమె అడిగిన వాళ్లలో సగం మంది కంటే ఇంకా ఎక్కువ జనం అన్నా డీఎంకేకు జై కొట్టారు. వారిలో చాలామంది ఈపీఎస్ పేరు చెబుతున్నారు. ఇక ఆమె సర్వే నిర్వహించిన వారిలో యువత.. 45 సంవత్సరాల లోపు ఉన్నవారు డీఎంకే పార్టీకి జై కొట్టారు. 45 సంవత్సరాల వయసు కు మించి ఉన్నవారు స్టాలిన్.. డీఎంకే కు ఓటు వేస్తామని చెబుతున్నారు. ఇక యువతలో అయితే కొంతమంది విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తామని అంటున్నారు.

అక్షిత నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో టీవీ కే విజయ్ పార్టీ అంతగా వినిపించకపోవడం విశేషం. ఆమె ప్రశ్నలు అడిగినవారు ఎక్కువగా అన్నా డీఎంకే లేదా డీఎంకే ఓటు వేస్తామని చెప్పారు. విజయ్ గురించి ప్రస్తావిస్తే.. ఓటర్లు ఆయన మొదటి భార్య సంగతి ఏంటని ఎదురు ప్రశ్న వేశారు. సొంత భార్యను పట్టించుకోని వ్యక్తి .. ఓటు వేసిన తర్వాత మమ్మల్ని ఎలా పట్టించుకుంటారని వారు ఉల్టా ప్రశ్నించారు. అయితే ఆమె సర్వేలో చూపిస్తున్న దృశ్యాలు తమిళనాడు స్థితిగతికి అద్దం పడుతున్నాయి. అయితే చాలామంది కూడా తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని.. చెబుతుండడం విశేషం

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper