‘సోము’.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చేనా..?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతోంది బీజేపీ. అందుకు తగినట్లుగానే రాష్ట్రంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారు. పోరాడుతున్నారు. ఇటీవల ఆలయాలపై దాడుల నేపథ్యంలోనూ ఆ పార్టీ నేతృత్వంలో చాలావరకు ఆందోళనలు చేశారు. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతీ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటూ ప్రభుత్వం పోరాడుతున్నారు. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా ప్రెస్‌మీట్లలోనూ రెచ్చిపోతున్నారు. Also Read: విశాఖ సాక్షిగా.. రాజీ‘డ్రామా’ల పర్వం..? అయితే.. రాష్ట్రంలో బీజేపీ నేతలు సమస్యలపై […]

Written By: Srinivas, Updated On : February 15, 2021 2:45 pm
Follow us on


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతోంది బీజేపీ. అందుకు తగినట్లుగానే రాష్ట్రంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారు. పోరాడుతున్నారు. ఇటీవల ఆలయాలపై దాడుల నేపథ్యంలోనూ ఆ పార్టీ నేతృత్వంలో చాలావరకు ఆందోళనలు చేశారు. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతీ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటూ ప్రభుత్వం పోరాడుతున్నారు. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా ప్రెస్‌మీట్లలోనూ రెచ్చిపోతున్నారు.

Also Read: విశాఖ సాక్షిగా.. రాజీ‘డ్రామా’ల పర్వం..?

అయితే.. రాష్ట్రంలో బీజేపీ నేతలు సమస్యలపై పోరాడుతుంటే.. కేంద్రం మాత్రం మోకాలడ్డుతోంది. ఢిల్లీ నేతల వ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రంలో పార్టీకి గడ్డు పరిస్థితులను తెస్తోంది. ఇక్కడి నేతలను చిక్కుల్లో పడేస్తున్నారు. ఓ వైపు అమరావతికి మద్దతుగా ఉండమని ఇక్కడి నేతలు సంకేతాలు ఇస్తూనే.. వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా తీసుకునే ప్రతీ నిర్ణయానికి అండగా నిలుస్తుంటారు. దీంతో బీజేపీ నేతలు ప్రజల్లో చులకన అవుతున్నారు తప్ప పలుకుబడి పెరగడం లేదు. కానీ.. ఇప్పుడు సోము వీర్రాజు పార్టీకి ప్రజల్లో నమ్మకం తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఉక్కు ఉద్యమం ఊపందుకుంటోంది. పార్టీలకతీతంగా ఉద్యమం నడిపించాలని ఇప్పటికే డిసైడ్‌ కూడా అయ్యారు. మరోవైపు దీనిపై ఇప్పటికే సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ కూడా రాశారు. వీటన్నింటి నేపథ్యంలో తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు బీజేపీ నేతలు. ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుస్తామని ప్రకటించారు. 14వ తేదీన వెళ్లి కలుస్తామని చెప్పినా.. ఒక రోజు తర్వాత ఢిల్లీ బయలుదేరుతున్నారు.

Also Read: మళ్లీ తెరపైకి హైదరాబాద్ ‘యూటీ’

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో టీమ్‌ ఢిల్లీకి బయలుదేరుతుండగా.. హైకమాండ్‌ను కలువబోతోంది. అయితే.. రాష్ట్రంలోని పరిస్థితిని వివరించి ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకొస్తారా.. లేదా పెద్దల మాటకు కట్టుబడి అదే నిర్ణయం ఫైనల్‌ అంటూ వెనుతిరుగుతారా అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీజేపీ టీమ్‌ మాత్రం ఫ్యాక్టరీని సాధించకొస్తే ఇక ఆ పార్టీకి ఢోకా ఉండదు. రాజకీయంగా పార్టీకి చాలావరకు ప్లస్‌ అవుతుంది. కానీ.. కేంద్రం ఈ విషయంలో ఇప్పటికే చాలా అడ్వాన్స్ స్టేజ్‌కు వెళ్లిందన్న ప్రచారం జరుగుతోంది. చివరకు ఏం జరుగుతోందో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్