https://oktelugu.com/

జన్మ నామ నక్షత్రం ప్రకారం మీ రాశికి ఆది దేవత ఎవరో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ఇష్టదైవాలను పూజించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు మాత్రం వారి జన్మ నక్షత్రం, రాశిని బట్టి ఇష్ట దైవాలను పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా పూజించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి దోషాలు సైతం తొలగిపోతాయని భావిస్తారు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మన నక్షత్రాన్ని నిర్ణయిస్తారు. ఈ నక్షత్రం ఆధారంగా మన రాశికి ఆధిదేవత ఎవరో నిర్ణయిస్తారు. దీనివల్ల ఆ వ్యక్తి జాతకంలో ఏర్పడిన దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 15, 2021 / 02:53 PM IST
    Follow us on

    సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ఇష్టదైవాలను పూజించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు మాత్రం వారి జన్మ నక్షత్రం, రాశిని బట్టి ఇష్ట దైవాలను పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా పూజించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి దోషాలు సైతం తొలగిపోతాయని భావిస్తారు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మన నక్షత్రాన్ని నిర్ణయిస్తారు. ఈ నక్షత్రం ఆధారంగా మన రాశికి ఆధిదేవత ఎవరో నిర్ణయిస్తారు. దీనివల్ల ఆ వ్యక్తి జాతకంలో ఏర్పడిన దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారు. అయితే ఇక్కడ ఏ రాశి వారికి ఏ దేవుడు అధిపతి అనే విషయాన్ని తెలుసుకుందాం….

    Also Read: శివుడికి విభూతి అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా..?

    * మేషం, వృశ్చికం: ఈ రెండు రాశుల వారి అధిదేవత అంగారకుడు కాబట్టి ప్రధాన ఆది దేవత శ్రీరాముడు, హనుమంతుడిని పూజించాలి.

    * వృషభం, తుల: ఈ రెండు రాశుల వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశివారు దుర్గా దేవిని పూజించాలి.

    * మిధునం, కన్య: ఈ రెండు రాశుల వారికి అధిపతి బుధుడు.కనుక ఈ రాశుల వారు వినాయకుడిని లేదా విష్ణువును పూజించాలి.

    * కర్కాటకం: ఈ రాశి వారికి ఆది దేవుడు చంద్రుడు కాబట్టి ఈ రాశి వారు శివుడిని పూజించాలి.

    * సింహం: ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశివారు ఆంజనేయ స్వామిని, గాయత్రి దేవుని పూజించాలి.

    * ధనస్సు, మీనం: ఈ రాశి వారికి అధిపతి పురుడు కాబట్టి ఈ రాశివారు విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.

    * మకరం, కుంభం: ఈ రెండు రాశుల వారికి అధిపతి శని కాబట్టి ఈ రాశుల వారు ఈశ్వరుడిని, హనుమంతుని పూజించాలి.

    Also Read: శుభకార్యాలకు వెళ్లే సమయంలో పిల్లి ఎదురు వస్తే వెనక రావడానికి కారణం ఇదే..!

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం