https://oktelugu.com/

స్వస్థలాలకు మంత్రుల పరుగులు

ఏపీలో ప్రస్తుతం పంచాయతీ పోరు నడుస్తోంది. ఈ పోరులో మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకొని మరోసారి అధికార పార్టీ సత్తా చాటాలని జగన్‌ ఛాలెంజ్‌గా ఉన్నారు. ఇందుకు సామ, దాన, భేద, దండోపాయాలను వాడుతున్నారు. అయినా.. పలుచోట్ల ఓటమి ఎదురవుతూనే ఉంది. మరోవైపు ప్రత్యర్థుల దూకుడుకు అడ్డుకట్టే వేసేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సీఎం జగన్‌ టార్గెట్లు అందుకోలేక మంత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్వస్థల్లోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 15, 2021 / 02:35 PM IST
    Follow us on


    ఏపీలో ప్రస్తుతం పంచాయతీ పోరు నడుస్తోంది. ఈ పోరులో మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకొని మరోసారి అధికార పార్టీ సత్తా చాటాలని జగన్‌ ఛాలెంజ్‌గా ఉన్నారు. ఇందుకు సామ, దాన, భేద, దండోపాయాలను వాడుతున్నారు. అయినా.. పలుచోట్ల ఓటమి ఎదురవుతూనే ఉంది. మరోవైపు ప్రత్యర్థుల దూకుడుకు అడ్డుకట్టే వేసేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సీఎం జగన్‌ టార్గెట్లు అందుకోలేక మంత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్వస్థల్లోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలం మరింత ఇబ్బందికరంగా తయారైంది.

    Also Read: విశాఖ సాక్షిగా.. రాజీ‘డ్రామా’ల పర్వం..?

    నిజానికి చెప్పాలంటే అసలు పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదు. కానీ.. ఎందుకో ప్రతి పార్టీ కూడా పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి. తమ బలం ఇంతా అంటే.. తమ బలం అంతా అంటూ చాటుతుంటాయి. ఎవరు ఎవరి సాయంతో గెలుస్తున్నారన్నది క్షేత్రస్థాయిలో మాత్రం అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మంత్రులను టార్గెట్‌ చేస్తే సత్తా చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు లైట్ తీసుకున్న వారి స్వస్థలాల్లోనే గట్టి అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. అక్కడ గెలిపించుకొని పార్టీ సత్తా చాటాలని చూస్తోంది.

    తాజాగా.. మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలమర్రులో టీడీపీ మద్దతుదారు శిరీష విజయం ఇలాంటిదే. ఇదొక్కటే కాదు రాష్ట్రంలో దాదాపు సగం మంది మంత్రుల నియోజకవర్గాల్లో, స్వస్థలాల్లో ప్రత్యర్ధులు వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. వైసీపీ మంత్రులు ఇప్పటివరకూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ క్యాండిడేట్లు గెలిస్తే చాలని అనుకున్నారు.

    Also Read: మళ్లీ తెరపైకి హైదరాబాద్ ‘యూటీ’

    కానీ.. ఇప్పుడు టీడీపీ సహా ఇతర ప్రత్యర్థి పార్టీలు వారు పుట్టిన స్థలాలు, మంత్రులు బలంగా భావించే పంచాయతీలను టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీ గెలుపు ఇప్పుడు మంత్రులకు కీలకంగా మారింది. దీంతో తొలి రెండు దశల్లో దృష్టిపెట్టని స్వస్థల వైపు మంత్రులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా తమ స్వస్థలాల్లో గెలుపొంది తమ సత్తా ఏంటో చూపాలని ఉబలాటపడుతున్నారు. లేదంటే పరువు పోవడం ఖాయమని కొందరు మంత్రులు ప్రెస్టేజీగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్