Homeజాతీయ వార్తలుPunjab CM Bhagwant Mann:ఫుల్లుగా తాగి తూలడంతో విమానం నుంచి దించేశారు.. పంజాబ్ ముఖ్యమంత్రి కి...

Punjab CM Bhagwant Mann:ఫుల్లుగా తాగి తూలడంతో విమానం నుంచి దించేశారు.. పంజాబ్ ముఖ్యమంత్రి కి ఘోర అవమానం..

Punjab CM Bhagwant Mann: రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండాలని ఒక సామెత. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా నవ్వుల పాలు కాక తప్పదు. అందుకే మన మాట తీరు, మన ఆహార్యం, తీసుకునే ఆహారం అన్ని హుందాగా ఉండాలని పెద్దలు అంటుంటారు. సామాన్య మానవులకే ఇన్ని నియమాలు ఉన్నప్పుడు.. పెద్ద పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు ఇంకా చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. సరిగ్గా అలాంటి ఘటనే జర్మనీలో జరిగింది. మీడియా పెద్దగా ఫోకస్ చేయలేదు గాని.. ఒకరకంగా చెప్పాలంటే పంజాబ్ తన పరువు నడి బజార్లో కోల్పోయింది. ఇందుకు కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వ్యవహార శైలే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అతడికి ఉన్న మద్యం తాగే అలవాటే. పొద్దున లేస్తే సచ్చిలమైన రాజకీయాలు చేస్తున్నామని ఊదరగొట్టే అరవింద్ కేజ్రివాల్ ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. అన్నట్టు ఈమధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అడుగులు వేసేందుకు కూడా తడబడ్డారు. యాదృచ్ఛికంగా ఈ రెండు సంఘటనలు లిక్కర్ తో ముడిపడి ఉన్నవే. మొదటిదేమో లిక్కర్ అనుమతుల్లో అవకతకల ద్వారా.. రెండోదేమో పీకల దాకా తాగడం ద్వారా..

Punjab CM Bhagwant Mann
Punjab CM Bhagwant Mann

..
పంజాబ్ ముఖ్యమంత్రి ని విమానం నుంచి దింపేశారా ?
..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వారం రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. సెప్టెంబర్ 11 నుండి 18 వరకు జర్మనీ పర్యటన కోసం ముందుగానే షెడ్యూల్ ఖరారు అయ్యింది. అయితే ఈ నెల 11 న ఢిల్లీ నుండి బయలుదేరి జర్మనీ వెళ్ళాడు మాన్. ఈ పర్యటన ఉద్దేశ్యం పంజాబ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి.
అయితే 18/9/2022 ఆదివారం రాత్రి జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం నుండి ఢిల్లీ రావాల్సిన లుఫ్టాన్సా ఎయిర్ లైన్స్ విమానం 4 గంటలు ఆలస్యంగా అక్కడి నుండి బయలుదేరింది అని లుఫ్తాన్స వెబ్ సైట్ లో క్లియర్ గా కనపడుతున్నది.
********************
లుఫ్తాన్స విమానం ఆలస్యం అవడానికి కారణం సాంకేతిక లోపం అని మొదట ప్రకటించినా తరువాత సర్దుకొని ఒక ప్రయాణీకుడిని విమానం నుండి దింపడానికి అలాగే అతని లాగేజీ ని విమానం నుండి బయటికి తీయడానికి ఆలస్యం అయింది అని సదరు ఎయిర్ లైన్స్ పేర్కొంది. ఇంతకీ ఎవరా ప్రయాణీకుడు ? విమాన ప్రయాణానికి అర్హత లేదు అని విమాన కెప్టెన్ ప్రకటించి మరీ విమానం నుండి దించేయడానికి కారణం అయిన వ్యక్తి ఎవరు ?

అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు తన పేరు చెప్పడానికి నిరాకరిస్తూ అసలు విషయం చెప్పేశాడు. విమానం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి 1:40 పీఎం (జీఎంటీ+2) కి బయలుదేరాలి అలాగే ఢిల్లీకి 12:55 ఏఎం ఐఎస్టీ (జీఎంటీ+5:30)కి చేరుకోవాలి. కానీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ తో పాటు అతని భార్య మరియు అతని సెక్యూరిటీ సిబ్బంది విమానంలోకి ప్రవేశించగానే మాన్ అడుగులు తడబడుతున్నాయి కానీ అతని భార్య సెక్యూరిటీ సిబ్బంది మాన్ ని పట్టుకొని జాగ్రత్తగా నడిపించడానికి ప్రయత్నించినా మాన్ తనంత తానుగా నడవలేని స్థితిలో ఉండడం వల్ల తోటి ప్రయాణీకులు ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఎయిర్ హోస్టెస్ తో పాటు అటెండర్ కూడా మాన్ కి సహాయంగా వచ్చినా లాభం లేకపోయింది. కానీ విమానం ఆలస్యంగా బయలుదేరాకుండా ఉండడానికి గాను కెప్టెన్ ప్రయత్నించగా తోటి ప్రయాణీకులు అభ్యంతరం పెట్టారు. అతనిని విమానం లోకి అనుమతిస్తే తాము దిగిపోతామని హెచ్చరించారు. పరిస్థితిని సమీక్షించిన కెప్టెన్ మాన్ సెక్యూరిటీ సిబ్బంది తో విమానం దిగి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. కానీ సెక్యూరిటీ సిబ్బంది కి అప్పటికే పంజాబ్ నుండి అధికారులు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితులలోనూ ఆలస్యం అవకుండా చూడండి ఎందుకంటే ముఖ్యమంత్రికి చాలాక్ అపాయింట్మెంట్ లు ఉన్నాయని ఆలస్యం అయితే అవన్నీ వాయిదా పడతాయి కాబట్టి ప్రయాణం కొనసాగించాల్సిందిగా చెప్పారు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఈయన ముఖ్యమంత్రి అని ఎట్టి పరిస్థితులలోనూ షెడ్యూల్ ఆలస్యం అవడానికి వీలులేదని చెప్పారు. కానీ కెప్టెన్ నిర్ణయమే ఏ ఎయిర్లైన్స్ అయినా పాటించాల్సి ఉంటుంది కాబట్టి కెప్టెన్ భగవత్ సింగ్ మాన్ ప్రయాణం చేయడానికి అర్హత లేదు అని ప్రకటించి మళ్ళీ విమాన దిగి వెళ్లిపొమ్మని విజ్ఞప్తి చేయడంతో చేసేది లేక మాన్ అతని భార్య,సెక్యూరిటీ సిబ్బంది విమానం దిగి వెళ్లిపోయారు కానీ లగేజీ ని తమతోనే ఉంచుకోవాలని పట్టు పట్టారు కానీ అప్పటికే లాగేజీ కంపార్ట్మెంట్ ని మూసివేశారు కనుక ఢిల్లీ లో తరువాతి రోజున తీసుకోవచ్చు అని ఎయిర్ లైన్స్ సిబ్బంది చెప్పినా వినలేదు సెక్యూరిటీ సిబ్బంది. లాగేజీ మాతో పాటే తీసుకెళతాం అని పట్టు పట్టడం వలన తప్పని సరి పరిస్థితుల్లో మాన్ కి చెందిన లాగేజీ ని దింపాల్సి వచ్చింది. ఇదంతా జరగడానికి నాలుగు గంటల సమయం పట్టింది.

అలా 5.52 పీఎం (జీఎంటీ+2)కి ఫ్రాంక్ఫర్ట్ లో బయలుదేరి ఢిల్లీ కి 4.30 ఐఎస్టీ (జీఎంటీ+5.30) చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం 1. 40 పీఎం కి బయలు దేరాల్సిన విమానం 5.52 కి బయలుదేరింది. అయితే మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్
చందర్ సూత దోగ్రా మాట్లాడుతూ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కి స్వల్ప అస్వస్థత వల్ల ఢిల్లీకి రావలసిన ప్రయాణాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించాల్సి వచ్చిందన్నారు. ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం లో జరుగుతున్న విషయం అప్పటికే బయటికి రావడం వల్ల ముఖ్యమంత్రి షెడ్యూల్ యధా ప్రకారం జరుగుతుందంటూ ముందు చెప్పిన సదరు చందర్ సూత దోగ్రా తరువాత మాట మార్చి చెప్పాల్సి వచ్చింది.
..
కొన్ని ట్విస్ట్ లు ఉన్నాయి
..
ఈ నెల 13 న బీఎండబ్ల్యూ అధికారులతో సమావేశం అయ్యాక మాన్ బీఎండబ్ల్యూ తన స్పేర్ పార్ట్శ్ తయారుచేసే ఫాక్టరీ ని పంజాబ్ లో పెట్టడానికి అంగీకరించిందని ప్రకటించాడు. కానీ మరుసటి రోజే బీఎండబ్ల్యూ ప్రతినిధి మాట్లాడుతూ తాము ఎలాంటి ఫాక్టరీ ని పంజాబ్ లో పెట్టట్లేదు అని కుండ బద్దలు కొట్టాడు. అసలు అలాంటి ఎంవోయూ ఏదీ కూడా తాము ఎవరితోనూ కుదుర్చుకోలేదు అని వివరంగా తెలిపాడు. కానీ పంజాబ్ కి బీఎండబ్ల్యూ వస్తున్న వార్త వైరల్ అయింది కానీ సదరు బీఎండబ్ల్యూ అధికారి ఆ వార్తని ఖండిస్తూ చేసిన ప్రకటన మాత్రం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు.
ఈ నెల 11 నుంచి 18 వరకు భగవత్ సింగ్ మాన్ పర్యటన బెర్లిన్, మ్యూనిచ్, ఫ్రాంక్ ఫర్ట్ లలో పర్యటించాడు. చివరికి డ్రింక్ టెక్_ 2022 అనే అంతర్జాతీయ మద్యం ఎగ్జిబిషన్ కి వెళ్ళాడు. డ్రింక్ టెక్_ 2022 అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒక సారి జరిగే ఎగ్జిబిషన్ అన్నమాట. ప్రపంచం లోని అన్ని దేశాల మద్యం బ్రాండ్ల కంపెనీలు ఒకే చోట పాల్గొంటాయి. భగవత్ సింగ్ మాన్ డిప్లొమాట్ హోదాలో డ్రింక్ టెక్- 2022 కి వెళ్ళాడు కాబట్టి ముఖ్య అతిధికి ఇచ్చే ఫ్రీ బాటిల్స్ బాగానే ఇచ్చి ఉండవచ్చు. అలాగే అన్ని ప్రముఖ అంతర్జాతీయ మద్యం బ్రాండ్ల ని కొని ఉండవచ్చు. దొరికిందే తడవుగా బాగా తాగేసి విమానం ఎక్కడానికి ప్రయత్నించే క్రమంలో తడబడ్డాడు. ఇక లాగేజీ లో కూడా భారీగా మద్యం ఉండి ఉండవచ్చు. ఢిల్లీ లో గ్రీన్ చానెల్ ద్వారా బయటికి రావొచ్చు ఎలాంటి తనిఖీలు లేకుండా కాబట్టి లాగేజీ తమ తోనే తీసుకెళ్తాం అని పట్టు పట్టడానికి ఇదే కారణం అయి ఉండవచ్చు. గతంలో కూడా భగవత్ సింగ్ మాన్ బాగా తాగి న్యూసెన్స్ సృష్టించిన సంఘటనలకి కొదువ లేదు అన్న సంగతి తెలిసిందే ! క్రేజీ వాల్ ఎటూ ప్రకటనల రూపంలో భారీగా అన్ని మీడియా సంస్థలకి ముట్టచెప్తూ ఉంటాడు కాబట్టి ఈ వార్తని తొక్కి పెట్టి ఉండవచ్చు. కాకపోతే రేపో మాపో ఎవరో ఒకరు విమానంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో కి వచ్చే అవకాశం అయితే ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular