జాతీయ వార్తలునయీం కేసులో సంచలనం..మరో కీలక పరిణామం

నయీం కేసులో సంచలనం..మరో కీలక పరిణామం

సినిమాల్లో వేల కోట్లు కొల్లగొట్టే గ్యాంగ్ స్టర్ లను చూస్తుంటాం.. మన పూరి జగన్నాథ్ అయితే గ్యాంగ్ స్టర్ లు లేకుండా ఈ మధ్య సినిమాలు తీయడం లేదు. కానీ రియల్ గ్యాంగ్ స్టర్ నయీంపై మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయడం లేదు. ఆ మధ్య రాంగోపాల్ వర్మ మొదలుపెట్టినట్టే కనిపించినా ఆ సినిమా అతీగతీ లేకుండా పోయింది. 2016 ఆగస్టు 9 న జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో హతమయ్యాడు.

Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..?

నయీం హతమయ్యాక మీడియా, అతడి బాగోతాలను పోలీసులు బయటపెట్టారు. ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టాడు.? భూ కబ్జాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా నయీం చీకటి కోణాలు బయటకు రావడంతో అంతా షాక్ అయ్యారు. నయీం బాధుతులు అందరూ బయటకు వచ్చి అతడు చేసిన ఘోరాలను చెప్పుకొచ్చారు. దీంతో నయీం కేసును సీబీఐతో కానీ విజిలెన్స్ తో కానీ విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ వచ్చింది.

నయీం కేసును లోక్ పాల్ చట్టం కింద విచారించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది.. నయీం కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అందుకే లోక్ పాల్ కిందకు తీసుకురావాలని కోరింది. నయీం కేసులో ఇప్పటికీ తేలని అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. నయీం డైరీ, భూములతోపాటు డబ్బులకు సంబంధించిన డంప్ ఎక్కడ ఉందో తేల్చాలని కోరింది. అయితే ఇంత సీరియస్ కేసులో పాత్ర ఉన్న పోలీసులక్ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కళంకిత పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ లభించడం సంచలనంగా మారింది. నయీంతో 25మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రాగా.. ఆ అధికారులను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Also Read: ‘ధరణి’లో మీ ఆస్తులను ఇలా నమోదు చేసుకోండి..

కాగా నయీం కేసులో విచారణ జరిపిన సిట్.. పోలీసు అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఆ 25మంది పోలీసు అధికారులకు ఊరట లభించింది. దీనికి వారికి ఇక పోస్టింగ్ లను ప్రభుత్వం ఇచ్చే అవకాశముంది. అంత పెద్ద కేసులో.. అన్ని ఆరోపణలు వచ్చిన కేసులో క్లీన్ చిట్ లభించడం చర్చనీయాంశమైంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Ustad Bhagat Singh New Look: రెట్రో గెటప్ లో పవన్ కళ్యాణ్ చిందులు..’ఉస్తాద్ భగత్ సింగ్’ లో స్వీట్ సర్ప్రైజ్!

Ustad Bhagat Singh New Look: వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా తిరుగులేని బ్లాక్ బస్టర్ ని అందించి,...

Dharmasthala Incidents: ధర్మస్థల హత్యల వివాదం.. పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదులో నిజముందా?

Dharmasthala Incidents: ధర్మస్థల.. కర్ణాటకలోని ఒక పవిత్రస్థలం. మంజునాథుడు కొలువై ఉన్న క్షేతం. ఏటా లక్షల మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అయితే టీవల ఈ క్షేత్రం దారుణమైన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది....

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...