kamal haasan wife : సీనియర్ నటి గౌతమి చెన్నై కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఆస్తి వివాదాలే అందుకు కారణం అని తెలియజేశారు. తమిళ మీడియా కథనాల ప్రకారం.. గౌతమికి చెన్నైలోని నీలంకరై లో భూమి ఉంది. దీని విలువ దాదాపు రూ. 9 కోట్లు అని సమాచారం. ఈ భూమిని అజగప్పన్ అనే వ్యక్తి ఆక్రమించాడని గౌతమి కోర్ట్ ను ఆశ్రయించారు. దాంతో ఆ భూమిని కోర్ట్ సీజ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు ఎవరు ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఆదేశాలు జారీ చేసింది.
ఈ భూ వివాదం నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని గౌతమి ఆరోపిస్తున్నారు. భూ ఆక్రమణ అడ్డుకుంటామని కొందరు తనను లంచం అడిగారని, లాయర్లుగా పరిచయం చేసుకుని బెదిరిస్తున్నారని గౌతమి ఫిర్యాదులో పొందుపరిచారు. తనకు రక్షణ కల్పించాలని కమిషనర్ ని కోరారు. ప్రస్తుతం ఈ వివాదం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : తమిళ బిగ్ బాస్ హోస్టింగ్ ను కమల్ హాసన్ ఎందుకు వదిలేశాడు? కారణమేంటంటే..?
1987లో పరిశ్రమకు వచ్చిన గౌతమి తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాలు చేసింది. శ్రీనివాస కళ్యాణం తెలుగులో ఆమె మొదటి చిత్రం. ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. గత రెండేళ్లుగా తెలుగులో ఆమె నటిస్తున్నారు. శాకుంతలం, స్కంద, మిస్టర్ బచ్చన్ చిత్రాల్లో గౌతమి కీలక రోల్స్ చేసింది. 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఏడాదికే అతనితో విడిపోయింది. అనంతరం 2005లో కమల్ హాసన్ తో వివాహం జరిగింది. 2016లో కమల్-గౌతమి విడాకులు తీసుకున్నారు.
గౌతమి రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. 1997లో బీజేపీ పార్టీలో చేరిన గౌతమి 2023 వరకు సుదీర్ఘంగా ఆ పార్టీలో ఉన్నారు. 2024లో గౌతమి బీజీపీని వీడారు. ప్రస్తుతం ఆమె అన్నాడీఎంకేలో ఉన్నారు.