https://oktelugu.com/

పంచాయతీ తర్వాత పరిషత్‌..: రంగులు పునరుద్ధరించొద్దు

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ డిసైడ్‌ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు..ఈ ఎన్నికల కోడ్‌ను ఇలాగే కంటిన్యూ అవుతుందని.. రంగులు పునరుద్ధరించవద్దని నిమ్మగడ్డ ఇప్పటికే స్పష్టం చేశారు. నిమ్మగడ్డ సూచనలతో జగన్ సర్కార్ డిఫెన్స్‌లో పడినట్లైంది. Also Read: ఒకే మాట.. ఒకే కట్టుబాటు..: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 6, 2021 / 12:23 PM IST
    Follow us on


    ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ డిసైడ్‌ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు..ఈ ఎన్నికల కోడ్‌ను ఇలాగే కంటిన్యూ అవుతుందని.. రంగులు పునరుద్ధరించవద్దని నిమ్మగడ్డ ఇప్పటికే స్పష్టం చేశారు. నిమ్మగడ్డ సూచనలతో జగన్ సర్కార్ డిఫెన్స్‌లో పడినట్లైంది.

    Also Read: ఒకే మాట.. ఒకే కట్టుబాటు..: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వాహనాలకు వైసీపీ రంగులకు సంబంధించిన ఆదేశాలతో ఈ విషయం వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే రేషన్‌ వాహనాలకు ఏవైనా తటస్థ రంగులు వేయాలని సూచించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే మళ్లీ వైసీపీ రంగులు పునరుద్ధరించవద్దని.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యే దాకా తటస్థ రంగులు కొనసాగించాలని సూచించింది.

    Also Read: ‘ఉక్కు’ద్రవం మొదలైంది

    రాష్ట్రంలో పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయా.. లేదా..? జరిగితే కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చి చేపడతారా..? ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలుపెడతారా అన్న సందేహాలు వస్తున్నాయి. రేషన్‌ వాహనాలపై రంగుల విషయంలో స్పష్టత ఇస్తూ జారీ చేసిన ఆదేశాల్లో ఈ అనుమానాలను నివృత్తి చేసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయనేది మాత్రం ఎస్‌ఈసీ మాటలతో స్పష్టమైంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు ప్రారంభించినా 4 వారాల ముందు కోడ్‌ అమల్లో ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21తో పంచాయతీ ఎన్నికలు ముగిస్తాయి. ఆ వెంటనే పరిషత్‌ ఎన్నికలు ప్రారంభించే అవకాశం ఉంది. కోడ్‌ అమల్లో ఉన్నందున వెంటనే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డురాదని భావిస్తున్నారు. ఇక దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.