https://oktelugu.com/

మోదీ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.10తో రూ.1.6 లక్షలు మీ సొంతం..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 10 రూపాయల చొప్పున ఆదా చేస్తే ఈ స్కీమ్ ద్వారా ఏకంగా లక్షా 60 వేల రూపాయలు పొందవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రోజుకు 10 రూపాయలు ఆదా చేయడం ద్వారా అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు పూర్తైన తరువాత లక్షా 60 వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. Also Read: గుండెపోటు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 6, 2021 4:42 pm
    Follow us on

    Sukanya Samriddhi Yojana

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 10 రూపాయల చొప్పున ఆదా చేస్తే ఈ స్కీమ్ ద్వారా ఏకంగా లక్షా 60 వేల రూపాయలు పొందవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రోజుకు 10 రూపాయలు ఆదా చేయడం ద్వారా అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు పూర్తైన తరువాత లక్షా 60 వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: గుండెపోటు వచ్చిన యజమానిని కాపాడిన కుక్క.. ఎలా అంటే..?

    ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీరేటు లభిస్తుంది. పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ఈ స్కీమ్ లో సులువుగా చేరే అవకాశం ఉంటుంది. 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

    Also Read: ఈ పంట పండిస్తే కోటీశ్వరులు కావచ్చు.. కిలోకి లక్ష ఆదాయం..?

    ఉదాహరణకు రోజుకు 10 రూపాయలు ఆదా చేసి ఏడాదికి 3650 రూపాయల చొప్పున సుకన్య సమృద్ధి ఖాతాలో 15 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే 21 సంవత్సరాల తరువాత 1,60,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉంటే వాళ్ల పేర్లపై పోస్టాఫీస్ లేదా బ్యాంకులలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవవచ్చు. కేంద్రం అందించే స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఈ స్కీమ్ ద్వారా వచ్చిన డబ్బులను ఆడపిల్లల పెళ్లి, ఇతర ఖర్చుల కోసం వినియోగించవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు.