Site icon OkTelugu

Tollywood Celebrity Second Marriage: విజయనిర్మల టు సమంత.. సెలబ్రెటీలకు రెండో భార్యలుగా..

Tollywood Celebrity Second Marriage

Tollywood Celebrity Second Marriage

Tollywood Celebrity Second Marriage: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, దర్శకులు చాలామంది సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తరువాత వాళ్ల లైఫ్ ను చాలా హ్యాపీ గా లీడ్ చేస్తున్నారు. మొదట పెళ్లి చేసుకున్న వాళ్ళతో విబేధాలు రావడం ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ బ్రేక్ అవుతుంది. దానివల్ల వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళ నుంచి విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే చిన్న విభేదాలు వచ్చిన కూడా డివోర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా వెలుగొందుతున్నప్పుడు అతనితో హీరోయిన్ గా నటించి కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేసిన విజయ నిర్మల కృష్ణ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Also Read: బాలయ్య కూతురు తేజస్విని డైరెక్టర్ గా మారుతుందా.? హీరో ఎవరంటే..?

ఇక అప్పటికే కృష్ణ గారికి ఇందిరా అనే భార్య ఉంది. వాళ్లకు ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇక విజయ్ నిర్మలకి సైతం అప్పటికే పెళ్లయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. తను కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. తను కృష్ణ ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కృష్ణ సైతం తన భార్యను ఒప్పించి మరీ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు…

ఇక నయనతార సైతం ప్రభుదేవా ను పెళ్లి చేసుకోవాలనుకుంది. వాళ్ళిద్దరు కొద్దిరోజులు ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు చట్టపట్టలేసుకొని తిరిగారు. దాంతో ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. కానీ ఫైనల్ గా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. ఇక నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ అనే దర్శకుడుని పెళ్లి చేసుకుంది… వాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇక సమంత సైతం నాగచైతన్య ను పెళ్లి చేసుకొని అతనితో విబేధాలు రావడంతో డివోర్స్ తీసుకుంది.

ప్రస్తుతం రాజ్ నిడిమోరు అనే దర్శకుడుని పెళ్లి చేసుకుంది… నిజానికి స్వాతంత్ర్య భారతదేశంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడంలో ఎలాంటి తప్పులేదు. అవతలి వాళ్ళు ఇబ్బంది పడనంతవరకు ఎవరి ఇష్టాలకు తగ్గట్టుగా వాళ్ళు తమ కెరియర్ ను లీడ్ చేసుకోవచ్చు. మొదటి పెళ్లిలో ఆనందం లేనప్పుడు వాళ్లకు డివోర్స్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పైతే లేదు. కానీ మొదటి వాళ్లతో ఎందుకు విభేదాలు వచ్చాయి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రెండోసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మంచిదని కొంతమంది సినిమా మేధావులు సలహాలిస్తున్నారు…

Exit mobile version