Site icon OkTelugu

Balayya Daughter Tejaswini Director Debut: బాలయ్య కూతురు తేజస్విని డైరెక్టర్ గా మారుతుందా.? హీరో ఎవరంటే..?

Balayya Daughter Tejaswini Director Debut

Balayya Daughter Tejaswini Director Debut

Balayya Daughter Tejaswini Director Debut: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ కి మంచి ఇమేజ్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. నందమూరి నటసింహం గా గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…మాస్ లో ఆయనకి మామూలు క్రేజ్ లేదు. రీసెంట్ గా చేసిన ‘అఖండ 2’ సినిమా ప్లాప్ అయినప్పటికి అంతకుముందు చేసిన నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో సీనియర్ హీరోలందరికంటే బాలయ్య బాబు ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇప్పుడు బాలయ్య బాబు చేస్తున్న సినిమాల కథల సెలక్షన్స్ అన్ని తన కూతురు అయిన తేజస్విని చూసుకుంటుంది. ఆమెకు సినిమాల మీద చాలా మంచి నాలెడ్జ్ ఉందని పలు సందర్భాల్లో బాలయ్య బాబు సైతం చెప్పాడు.

Also Read: ఈ మూడు రాశుల వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలు.. ఇందులో మీ రాశి ఉందా..?

దానికి తగ్గట్టుగానే ఇప్పుడు బాలయ్య బాబు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది. ప్రేక్షకులు ఆయన నుంచి ఎలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనే విషయాలను అన్ని రకాలుగా ఆమె ఆలోచించి బాలయ్య బాబు ఇమేజ్ కు తగ్గ కథలను సెలెక్ట్ చేసి సినిమాలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. అందువల్లే బాలయ్య బాబుకి ఈ మధ్యకాలంలో సక్సెస్ రేట్ చాలా పెరిగింది…

ఇక ప్రస్తుతం ఆమె ఒక కథను కూడా రెడీ చేసుకుందట. ఆమె డైరెక్షన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె డైరెక్షన్లో రాబోయే సినిమాలో హీరో ఎవరు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. నిజానికి బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి ఆమె కథ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబును టాప్ రేంజ్ లో చూపించగలిగే కెపాసిటీ తన కూతురికి ఉందా? లేదా అనే రీతిలో కొన్ని అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. తేజస్విని లాంటి సినిమాల మీద మంచి గ్రిప్ ఉన్న అమ్మాయి బాలయ్య బాబుతో ఒక మంచి సినిమాను చేస్తే చూడాలని బాలయ్య అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…

Exit mobile version