Site icon OkTelugu

Lunar Eclipse: చంద్రగ్రహణం సమయంలో శాస్త్రం ప్రకారం పాటించాల్సిన ముఖ్యమైన పది నియమాలు ఇవే..

Lunar Eclipse

Lunar Eclipse

Lunar Eclipse: ఆకాశంలో జరిగే అద్భుతాల నేపథ్యంలో భారత దేశంలో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తున్నారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షపై రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం సందర్భంగా భారతీయ సంస్కృతిలో ప్రత్యేకంగా ఆచారాలు పాటిస్తున్నారు. ఇవి వేల ఏళ్ల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. చంద్రగ్రహణం అనేది శరీరం, మనసు, పర్యావరణానికి సంబంధించినదని.. గ్రహణం పట్టిన తర్వాత శరీరంతో పాటు ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని పెద్దలు చెప్పారు. అప్పటినుంచి తరతరాల నుంచి పాటిస్తూ వస్తున్నారు. అసలు గ్రహణం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలి? వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు? అయితే వీటిలో ముఖ్యమైన పదింటి గురించి చర్చిద్దాం..

Also Read: ఈ మూడు రాశుల వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలు.. ఇందులో మీ రాశి ఉందా..?

గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు అంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఏదైనా ఆహారం తినడం వల్ల అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉందని అంటుంటారు. పూర్వకాలంలో ఆహారం విలువ చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. అందువల్ల ఇవి నిల్వచేస్తే పాడైపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా నిల్వచేసిన ఆహారంపై గ్రహణ ప్రభావం పడుతుందని భావిస్తుంటారు. అందువల్ల గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినడం లేదా తీసుకోవడం జరగదు.

గ్రహణ సమయంలో వంట చేయరాదని అంటుంటారు. ఈ సమయంలో చేసిన వంట శక్తి కోల్పోతుందని భావిస్తారు. అయితే పూర్వకాలంలో గ్రామ సమయం లో మొత్తం చీకటిగా ఉండేది. ఆ సమయంలో విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. అందువల్ల గ్రామ సమయంలో ఎలాంటి ఆహారం తయారు చేయకూడదని భావించి ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమమైన ఈ సమయంలో వండిన ఆహారం అపరిశుభ్రంగా మారుతుందని భావిస్తున్నారు.

గ్రహానికి ముందే ఆహార పదార్థాలపై గరిక ఉంచాలని చెబుతూ ఉంటారు. దీనిని ఆహారంలో ఉంచడం వల్ల అవి శుద్ధిగా ఉంటాయని నమ్ముతారు. అయితే ఇందులో యాంటీ బ్యాక్టీరియా ఉండడంతో ఆహార పదార్థాలను పాడవకుండా కాపాడుతుంది. అందువల్ల ప్రార్థన కాలం నుంచి ఆహార పదార్థాల్లో గరిక వాడుతూ వస్తున్నారు.

గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు వెళ్లకూడదని చెబుతుంటారు. అంతేకాకుండా వీరు కత్తులు వాడరాదని అంటుంటారు. గ్రహణ ప్రభావం శిశువుపై పడుతుందని నమ్ముతారు. అయితే పూర్వకాలంలో వెలుతురు లోపం ఉండడంవల్ల గర్భిణీలను జాగ్రత్తగా చూసుకోవాలని ఈ నియమాన్ని ఉంచారు. వీరు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ వస్తున్నారు.

గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. ఈ సమయంలో దైవ శక్తి తక్కువగా ఉంటుందని.. ప్రకృతి శక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. గ్రహణ ప్రభావం ఆలయాలపై ఎక్కువగా ఉండటం వల్లే ఈ నియమాన్ని ఉంచినట్లు తెలుస్తోంది.

గ్రహణ సమయంలో కొన్ని ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. అందువల్ల ఈ సమయంలో మంత్రాలు, జపాలు చేయాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్ముతారు.

ఈ సమయంలో నిద్ర పోవద్దని కొందరు చెబుతూ ఉంటారు. గ్రామ సమయంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో నిద్ర పోయినా కూడా ఆరోగ్యంగా ఉండలేక పోతారు. అందువల్ల ఈ సమయంలో నిద్ర పోకుండా జపం చేయాలని చెబుతారు.

శుభకార్యాలు చేయకూడదని అంటారు. గ్రహణ సమయంలో దైవిక శక్తి తక్కువగా ఉంటుందని.. దీంతో శుభకార్యాలు నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు ఉండవని చెబుతారు.

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలని నిబంధన ఉంటుంది. గ్రహణం సమయంలో భూమిపై పడిన కిరణాలవల్ల వాతావరణం కాలుష్యం అవుతుందని.. ఇంటిని శుభ్రం చేయడం వల్ల శుద్ధి చేసిన వారు అవుతాం అని భావిస్తూ ఉంటారు.

గ్రహణం తర్వాత ఇతరులకు దానం చేయాలని చెబుతారు. అలా చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.

Exit mobile version