https://oktelugu.com/

చక్కెర ఎక్కువగా తినే పిల్లల్లో ఆ సమస్యలు.. శాస్త్రవేత్తల వెల్లడి..?

మనం రోజూ కాఫీ, టీ, స్వీట్లలో చక్కెరను ఎక్కువగా వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. చక్కెర తినడం వల్ల బరువు పెరుగుతామని తెలిసినా చాలామంది రుచి కోసం చక్కెరను వినియోగిస్తారు. మితిమీరి చక్కెరను తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బెల్జియం శాస్త్రవేత్తల పరిశోధనలో చక్కెరను ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌ ట్యూమర్లు మరింత వేగంగా పెరుగుతాయని తేలింది. Also Read: ప్రతిరోజూ నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..? ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరిన చక్కెర పులిసిపోతుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 6, 2021 / 12:23 PM IST
    Follow us on

    మనం రోజూ కాఫీ, టీ, స్వీట్లలో చక్కెరను ఎక్కువగా వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. చక్కెర తినడం వల్ల బరువు పెరుగుతామని తెలిసినా చాలామంది రుచి కోసం చక్కెరను వినియోగిస్తారు. మితిమీరి చక్కెరను తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బెల్జియం శాస్త్రవేత్తల పరిశోధనలో చక్కెరను ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌ ట్యూమర్లు మరింత వేగంగా పెరుగుతాయని తేలింది.

    Also Read: ప్రతిరోజూ నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

    ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరిన చక్కెర పులిసిపోతుంది. పులిసిపోయిన చక్కెర వల్ల శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు శక్తి పొందుతాయి. అయితే పిల్లలు ఎక్కువగా చక్కెరను తీసుకోకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిల్లలు చక్కెరను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో సూక్ష్మజీవులు ఏర్పడతాయని పిల్లలు పెద్దైన తరువాత కూడా సూక్ష్మజీవుల ప్రభావం పిల్లలపై ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    Also Read: నీళ్లు తక్కువగా తాగుతున్నారా.. శరీరానికి కలిగే నష్టాలివే..?

    కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఎలుకలపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. శరీరంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎలుకలపై అధ్యయనం చేసిన పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు పిల్లలకు కూడా వర్తిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకలను నాలుగు గ్రూపులుగా విభజించి శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    పిల్లలు ఎక్కువగా చక్కెరను తీసుకుంటే వారి జీవక్రియపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీలో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురించబడ్డాయి. చ‌క్కెర ఎక్కువ‌గా తింటే అందం పాడయ్యే అవకాశాలు ఉంటాయి.