Russia-Ukraine: ఉక్రెయిన్ ఆక్రమణకు రంగం సిద్ధమైంది. రష్యా తన బలగాలను మోహరించింది. ఏ క్షణాన్నైనా దాడి చేసేందుకు సమాయత్తమైంది. దీంతో ఉక్రెయిన్ లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆ దేశ పౌరులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తమ భవితవ్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. అధ్యక్షుడు మాత్రం భయపడొద్దని సూచిస్తున్నారు అమెరికా కూడా యుద్ధంతో ఏది సాధించలేమని చెబుతున్నా రష్యా మాత్రం వినడం లేదు. దీంతో ఇక యుద్ధమే శరణ్యమనే భావనకు వస్తోంది.
రష్యా ఏక్షణంలోనైనా దాడికి ప్రయత్నం చేయవచ్చు అని పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడినా ఆయన వినకపోవడంతో ఇక యుద్ధం తప్పదనే సంకేతాలు అమెరికా సైతం ఇచ్చింది. ఉక్రెయిన్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యుద్ధంతో ఇంకా సమస్యలు పెరుగుతాయని తెలిసినా రష్యా యుద్ధానికే కాలు దువ్వుతోంది.
ఈ నేపథ్యంలో రష్యా చర్యలకు అంతర్జాతీయంగా సహకారాలు లేకున్నా తగ్దేదేలే అంటోంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యకే మొగ్గు చూపుతోంది. దీంతో ఇక తాము కూడా యుద్ధం చేస్తామని ఉక్రెయిన్ చెబుతున్నా దాని వద్ద అంత మేర ఆయుధాలు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ముప్పేట దాడి చేసేందుకు రష్యా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇతర దేశాల సరిహద్దులను కూడా వాడుకుని ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Also Read: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అందరిని కూడగడుతున్న కేసీఆర్?
బెలారస్ కు సమీపంలో రష్యా బలగాలు మోహరించాయి. సైనికులు కూడా దేశ సరిహద్దుల్లో ఆయుధాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రష్యా దాడి నేపథ్యంలో ఇతర దేశాలనుంచి వచ్చే విమానాల రాకపోకలను నిషేధించాయి. దీంతో ఉక్రెయిన్ తో సంబంధాలు తెగిపోయాయి.
ఇప్పటికే అన్ని ఆయుధాలు సమకూర్చుకుంది. సుఖోయ్, ఎస్-400 వంటి విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సైనికులను కూడా మోహరించింది. సంకేతాలు రావడమే తరువాయి యుద్ధం చేయడానికి సంకల్పించింది. దీంతో అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడు సరే అంటే అప్పుడే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: కేంద్రం తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం..: ఈసారి ఎవరికి గడ్డుకాలమో..?