UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొదటి విడత ఎన్నికలు నిర్వహించగా పార్టీలు విజయం కోసం కసరత్తు చేస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి రావాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. యూపీలో ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ ఆదిత్యనాథ్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ కూడా తన ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. సీఎం అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ తన శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారు. సర్వేలు కూడా బీజేపీ, ఎస్పీ మధ్యే పోటీ అనివార్యమవుతోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీ ల ప్రభావం మాత్రం చూపించలేకపోతున్నాయి. కాంగ్గ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని రంగంలో దింపినా ఆశించిన ఫలితాలు రావడం కలేనని తెలుస్తోంది.
ఇంకోవైపు ఎంఐఎం కూడా తన ప్రభావం చూపుతుందా లేదా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. యూపీలో ఇప్పటివరకు ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న పతంగి పార్టీ ప్రభావం ఎంత మేర ఉంటుందో తెలియడం లేదు. కానీ ఇది ప్రభావం చూపితే బీజేపీకే లాభం జరుగుతుందనే ఆలోచనలో కమలదళం ఉంది. బిహార్ లో కూడా ఇదే జరిగింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో బీజేపీ దాని మిత్రపక్షాలు విజయం సాధించడం తెలిసిందే. ఇక్కడ కూడా అదే పునరావృతం అవుతుందని అందరిలో ఆశలు పెరుగుతున్నాయి. కానీ ఎంఐఎం విజయం సాధిస్తేనేగా అని తెలుస్తోంది.
Also Read: ఉక్రెయిన్ పై యుద్ధానికి మోహరించిన రష్యా.. రంగంలోకి అమెరికా..కలకలం
యూపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల్లో ప్రచారం హోరెత్తుతోంది. ఎస్పీ ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంటే బీజేపీ మరోమారు అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీనికి గాను ఓటర్లను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి. పక్కా వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. కులాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నాయి. దీంతో రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది.
వచ్చే 2024 ఎన్నికలకు ఇవి మాదిరిగా నిలుస్తాయని భావిస్తున్న పార్టీలు ఎలాగైనా విజయం దిశగా దూసుకెళ్లాలని చూస్తున్నాయి. పక్కా ప్రణాళికలు రచిస్తూ పరిస్థితులను తమ వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తున్నాయి.
Also Read: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్