Hyderabad Sunrisers: హైదరాబాద్ సన్ రైజర్స్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆటగాళ్ల ఎంపికలో ఏం నిర్ణయించుకుందో ఎవరికి అర్థం కావడం లేదు. అంతగా ప్రాధాన్యం లేని ఆటగాళ్ల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం సందేహాలకు తావిస్తోంది. విజయం సాధించాలని భావించే ఫ్రాంచైజీ ఆటగాళ్ల ఎంపికలో ఏ ప్రాతిపదిక తీసుకుందో అంతుచిక్కడం లేదు. దీంతో సన్ రైజర్స్ తీరుపై సహజంగానే ఆగ్రహం పెరుగుతోంది.

ఎందుకు పనికి రాని ఆటగాళ్ల కోసం రూ. కోట్లు వెచ్చించింది. తన గోతి తానే తవ్వుకుంటోంది. అన్ని ఫ్రాంచైజీలు మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేస్తే ఫామ్ లో లేని వారిని తీసుకుని సన్ రైజర్స్ మరోమారు తప్పు చేసిందనే ఆరోపణలు మూటగట్టుకుంటోంది. దీంతో ఈ సీజన్ లో ఎలా బతికి బట్టకడుతుందో అని అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది.
Also Read: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్
దీంతో వారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. సన్ రైజర్స్ నిర్వాహకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీ ఆటగాళ్లకు కూడా పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయడం విమర్శల పాలైంది. దీంతో ఫ్రాంచైజీ తీరుపై ప్రేక్షకుల్లో ఆగ్రహం పెరుగుతోంది. స్టార్ ఆటగాళ్లను కాదని అనామకులను దక్కించుకోవడం నిజంగానే అందరిలో అనుమనాలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు మంచి ఆటగాళ్లను దక్కించుకోగా సన్ రైజర్స్ మాత్రం ఎవరు కొనుగోలు చేయని వారిని తీసుకుని అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ సీజన్ లో ఆడే ఆటల్లో విజయాలు సాధిస్తుందో లేక చతికిల పడుతుందో తెలియడం లేదు. మునుముందు జరగబోయే పర్యవసానాలకు బాధ్యత ఫ్రాంచైజీయే వహించాల్సి ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Also Read: మరోసారి ‘చలో విజయవాడ’: ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన టీచర్లు