తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టాలు తప్పవా..?

సాధారణ సమయంలో కంటే పండుగల సీజన్‌లో తెలుగు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎక్కువగా హైదరాబాద్‌లో స్థిరపడడం.. మధ్యమధ్యలో సొంత ఊర్లకు వెళ్లడం సాగిస్తుంటారు. కానీ కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి దాపురించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొన్ని కేంద్రప్రభుత్వం ఒక్కో రంగానికి సడలింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను నడుపుకోవచ్చని తెలిపింది. […]

Written By: NARESH, Updated On : October 13, 2020 10:26 am
Follow us on

సాధారణ సమయంలో కంటే పండుగల సీజన్‌లో తెలుగు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎక్కువగా హైదరాబాద్‌లో స్థిరపడడం.. మధ్యమధ్యలో సొంత ఊర్లకు వెళ్లడం సాగిస్తుంటారు. కానీ కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి దాపురించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొన్ని కేంద్రప్రభుత్వం ఒక్కో రంగానికి సడలింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను నడుపుకోవచ్చని తెలిపింది. అయితే ఆ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై వారి ఇష్టానికి వదిలేసింది.

Also Read: ఉత్కంఠ: జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటన.. ఏం జరుగనుంది?

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇంకా సందిగ్ధం నెలకొంటూనే ఉంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో బస్సులు లేకపోవడంతో పండుగల వరకు బస్సులు ఉంటాయా..? లేదా..? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇటీవల ఏపీ, తెలంగాణ ఆర్టీసీ, రవాణాశాఖల ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి పరిష్కారం లభించడం లేదు.

బస్సు సర్వీసులపై ఏపీ మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణలు తెలంగాణ మంత్రులతో చర్చిస్తామని నిర్ణయించుకున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి తమతో చర్చించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని వారంటున్నారు. కానీ అతికొద్దిరోజుల్లోనే పండుగలు ఉండడంతో ముందుగా తమ ఊళ్లలోకి వెళ్లేవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వాపోతున్నారు. ఇలా ప్రభుత్వాల మధ్య వివాదాలు సృష్టించుకుంటే సామాన్య ప్రజలు బలవుతున్నారని అంటున్నారు.

ఇక తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏపీ అధికారుల ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మీడియా సమావేశాల్లో చెబుతున్నారు. తెలంగాణ ప్రతిపాదించిన వాటికి అంగీకరిస్తే బస్సులు తిరుగుతాయని అంటున్నారు. ఇంతకుముందు తెలంగాణ లక్ష కిలోమీటర్ల తగ్గింపు ప్రతిపాదనపై 50 వేల కిలోమీటర్లను ఏపీ తగ్గించుకుంటుందని, 50 వేల కిలోమీటర్లను తెలంగాణ పెంచుకోవచ్చని ఏపీ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు.

Also Read: ఉత్తరాంధ్ర సవాల్: ఏపీ మంత్రులు.. బాబుపై నెగ్గుతారా..?

అయినా తెలంగాణ ఆర్టీసీ బెట్టువీడడం లేదు. విజయవాడ, హైదరాబాద్‌ రూట్‌ విషయంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు పట్టుబడుతుండడం చర్చనీయంశాంగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు చర్చలు జరిగినా ఎటువంటి పరిష్కారం లాభించకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.