https://oktelugu.com/

కరోనా టైంలోనూ రేటు పెంచేసిన నటుడు.. ఎవరంటే..!

కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినీరంగం కుదేలైపోయింది. థియేటర్లు మూతపడగా.. సినిమా షూటింగులు నిలిచిపోవడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇటీవల సినిమా షూటింగులు ప్రారంభం కావడంతో టాలీవుడ్లో మళ్లీ సందడి మొదలైంది. Also Read: అర్హ కోసం దిండుగా మారిన అయాన్! కరోనా నిబంధనలు పాటిస్తూ దర్మకులు షూటింగులను ప్రారంభిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో తక్కువ మందితోనే సినిమా షూటింగ్స్ చేయాల్సి వస్తోంది. ఇక కరోనా నిబంధనల కారణంగా నిర్మాతలపై […]

Written By: , Updated On : October 13, 2020 / 10:31 AM IST
Follow us on

కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినీరంగం కుదేలైపోయింది. థియేటర్లు మూతపడగా.. సినిమా షూటింగులు నిలిచిపోవడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇటీవల సినిమా షూటింగులు ప్రారంభం కావడంతో టాలీవుడ్లో మళ్లీ సందడి మొదలైంది.

Also Read: అర్హ కోసం దిండుగా మారిన అయాన్!

కరోనా నిబంధనలు పాటిస్తూ దర్మకులు షూటింగులను ప్రారంభిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో తక్కువ మందితోనే సినిమా షూటింగ్స్ చేయాల్సి వస్తోంది. ఇక కరోనా నిబంధనల కారణంగా నిర్మాతలపై మరింత భారం పడనుంది. దీనిని తగ్గించేందుకు స్టార్ హీరోహీరోయిన్లు.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు తమ రెమ్యూనేషన్లో కొంత తగ్గించుకోవాలని నిర్మాతల గిల్డ్ కోరుతోంది.

గిల్డ్ ప్రాతిపదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం తమ పారితోషికం తగ్గించుకునేందుకు సమ్మతించినట్లు తెలుస్తోంది. ఈమేరకు గిల్డ్ కూడా ఎవరెవరూ ఎంతమేర పారితోషికం తగ్గించుకోవాలనేది డిసైడ్ చేయగా ‘మా’ కూడా ఆమోదించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే గిల్డ్ ప్రతిపాదనకు భిన్నంగా నటుడు మురళీ శర్మ మాత్రం ఏకంగా రోజుకు రూ.75వేలు పెంచేసినట్లు తెలుస్తోంది. ఆయన నటించిన సినిమాలన్నీ ఇటీవల మంచి విజయాలు సాధించడంతో ఆయన తన రేటును ఒక్కసారిగా పెంచేసినట్లు తెలుస్తోంది. ‘అలవైకుంఠపురములో’ మూవీ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ప్రతీరోజు పండగే.. సరిలేరునికెవ్వరూ.. అలవైకుంఠపురములో సినిమాల్లో మురళీశర్మ నటించారు. ఈ సినిమాలకు ఆయన రోజుకు లక్షన్నర వరకు తీసుకునేవారట. ప్రస్తుతం ఆయన పేమెంట్ రోజుకు రెండులక్షల పాతికవేలకు చేరిందనే టాక్ విన్పిస్తోంది. ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుండటంతో ఆయన పారితోషకం పెంచినట్లు తెలుస్తోంది.

Also Read: నాని ప్లాప్స్ కు కారణం అదేనట !

కరోనా టైంలో ఆయన రేటు పెంచడంపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్ననటులే తమ నిబంధనలు పాటించకపోతే స్టార్ హీరోలు మాత్రం లెక్క చేస్తారా? అనే భావన నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. దీంతో నటీనటులు.. స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎలా కంట్రోల్ చేయాలా? అని గిల్డ్ తలలు పట్టుకుంటోంది.