https://oktelugu.com/

ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా: రోజా

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడంతో ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెనాయుడు అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ అధికారులు శ్రీకాకుళంలోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అనంతరం ఇంట్లో సోదాలు చేపట్టి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వైసీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. అన్యాయంగా అచ్చెనాయుడిని అరెస్టు చేశారని టీడీపీ నేతలు ప్రభుత్వం పదేపదే ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 12, 2020 / 05:15 PM IST
    Follow us on


    టీడీపీ ఎమ్మెల్యే అచ్చెనాయుడిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడంతో ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెనాయుడు అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ అధికారులు శ్రీకాకుళంలోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అనంతరం ఇంట్లో సోదాలు చేపట్టి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వైసీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. అన్యాయంగా అచ్చెనాయుడిని అరెస్టు చేశారని టీడీపీ నేతలు ప్రభుత్వం పదేపదే ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ ఇష్యూపై నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా తాజాగా స్పందించారు. అచ్చెనాయుడి అరెస్టుపై తనదైన శైలిలో స్పందిస్తూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

    ‘టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని’ రోజా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెనాయుడు తప్పు చేశారని రుజువైనందునే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు కిడ్నాప్ చేశారని చెప్పుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి అంశాన్ని లెక్కలతో సహా నిరూపించారని గుర్తుచేశారు. గతంలోనే చంద్రబాబు తనయుడు లోకేష్ తమ ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని మీడియాలో సమావేశంలో వ్యాఖ్యానించారని తెలిపారు. అచ్చెన్నాయుడి అవినీతికి పాల్పడినందు వల్లే అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని టీడీపీ నేతలను హెచ్చరించారు. రాజధాని భూముల్లో అక్రమాలు, ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లోని అవకతవకలను ప్రభుత్వం బయటికి తెస్తుందన్నారు. అవినీతికి పాల్పడితే బీసీ అయినా, ఓసీ అయినా.. ఎస్సీ అయినా జైలుకు పంపడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.