జీహెచ్ఎంసీ మేయర్ ను వెంటాడుతున్న కరోనా..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కరోనా పంజా విసురుతోంది. హైదరాబాద్ మహానగరంలో గత పదిరోజులుగా కేసులు సంఖ్య వందల సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 209 కేసులు కొత్తగా నమోదుకాగా జీహచ్ఎంసీ పరిధిలోనే 175కేసులు నమోదవడం గమనార్హం. నిన్న ఒక్కరోజే కరోనాతో తొమ్మిది మంది మృతిచెందాడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు మహానగరంలో డబుల్ డిజిట్ కే పరిమితమైన కేసులు […]

Written By: Neelambaram, Updated On : June 12, 2020 5:10 pm
Follow us on


తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కరోనా పంజా విసురుతోంది. హైదరాబాద్ మహానగరంలో గత పదిరోజులుగా కేసులు సంఖ్య వందల సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 209 కేసులు కొత్తగా నమోదుకాగా జీహచ్ఎంసీ పరిధిలోనే 175కేసులు నమోదవడం గమనార్హం. నిన్న ఒక్కరోజే కరోనాతో తొమ్మిది మంది మృతిచెందాడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు మహానగరంలో డబుల్ డిజిట్ కే పరిమితమైన కేసులు ప్రస్తుతం మూడెంకలు చేరడం చూస్తుంటే వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ మేయర్ ను కూడా కరోనా వదలడం లేదు.

మేయర్ బొంతు రాంమ్మోహన్ నగరంలో ఎక్కడి వెళితే అక్కడ కరోనా ఛాయలు కన్పిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మేయర్ కరోనా బారినుంచి తప్పుకున్నారు. అయితే కరోనా మాత్రం మేయర్ ఫాలో అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులు క్రితం మేయర్ ఓ హోటల్లో టీ తాగాడు. అనంతరం మేయర్ కు టీ అందించిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మేయర్ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ టెస్టుల్లో మేయర్ కు నెగిటివ్ రిపోర్టు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా మరోసారి మేయర్ కరోనా కారణంగా వార్తల్లో నిలిచారు. బుధవారం ఆయన పేషిలో ఓ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయంలోని సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈక్రమంలో గురువారం మేయర్ కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తించింది. దీంతో మేయర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ అధికారులు హోం క్వారంటైన్ చేశారు. వరుసగా రెండ్రోజులు కరోనా వైరస్ మేయర్ ను వెంటాడింది. ఈనేపథ్యంలోనే మేయర్ బొంతు రాంమోహన్ మరోసారి కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టులు నేటి సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోర్టులో ఏం తేలుతుందో వేచి చూడాల్సిందే..!