Ramoji Rao: పాపం రామోజీ.. చరమాంకంలో ఎన్ని కష్టాలు!

రామోజీరావును బహిరంగంగా వెనకేసుకొచ్చే కొంతమంది జర్నలిస్టుల తీరు జనాలకు ఏవగింపు కలిగిస్తోంది. నేను తప్పు చేస్తాను.. ఆ హక్కు నాకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 18, 2023 4:36 pm

Ramoji Rao

Follow us on

Ramoji Rao: పచ్చళ్ళ వ్యాపారం విజయవంతమైంది. పేపర్ బిజినెస్ సక్సెస్ అయింది. చిట్స్ పెడితే వేలకోట్లు సంపాదించి పెట్టింది. అప్పటికి ఆశ చావలేదు. సినిమా రంగంలోనూ వేలు పెడితే అందులోనూ లాభాలు వచ్చాయి. టీవీ చానల్స్ పెడితే కొన్ని మినహా మిగతావన్నీ జనాల ఆదరణ చూరగొన్నాయి. అంతటితో ఆశ చావలేదు. వేల ఎకరాల్లో ఫిలిం సిటీ కడితే అందులోనూ అరివీర భయంకరమైన లాభాలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీ వ్యాపార సామ్రాజ్యం ఇక్కడితో ముగియదు.. మరి ఇంతటి సామ్రాజ్య విస్తరణ వెనుక ఎటువంటి చెడు జరగలేదా? ఎవరికి ఎటువంటి అన్యాయం జరగలేదా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే బలమైన మీడియా ద్వారా, తనకున్న లాబీయింగ్ ద్వారా రామోజీరావు తొక్కిపెట్టాడు. రోజులు అన్ని ఓకే తీరుగా ఉండవు. ఉండవల్లి అరుణ్ కుమార్ రూపంలోనో, యూరి రెడ్డి రూపంలోనో, జగన్మోహన్ రెడ్డి రూపంలోనో దెబ్బలు తగులుతూనే ఉంటాయి. యద్భావం తద్భవతి అనే సామెతను నిరూపిస్తూనే ఉంటాయి.

యూరి రెడ్డి కేసుతో..

ప్రస్తుతం రామోజీరావు చరమాంకంలో ఉన్నారు. ఈ వయసులో ఉన్న వారు ఎవరైనా సరే కొంచెం సాంత్వన కోరుకుంటారు. శాంతియుత జీవనాన్ని ఆశిస్తారు. కానీ రామోజీరావు కు ప్రస్తుతం అయింది. సువిశాలమైన రామోజీ ఫిలిం సిటీ లో.. శ్వేత వర్ణంలో ఉన్న భవనంలో బంగారు రంగు సింహాసనంలో కూర్చునే రామోజీరావుకు అంత్యకాలంలో కేసులు అపకీర్తి తెస్తున్నాయి. మార్గదర్శి కేసులో అభియోగాలు వస్తే మీడియా నోరు నొక్కుతున్నారంటూ అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మీద రామోజీరావు తిరగబడ్డారు. తను ఏ తప్పు చేసినప్పటికీ అది మీడియా మీద దాడిగానే అభివర్ణించేవారు. అక్కడిదాకా ఎందుకు తన ప్రయోజనాలకు అడ్డువస్తున్నాడనే నెపంతో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని చందాల రెడ్డిగా అభివర్ణించాడు. ఒకవేళ రామోజీరావు చెప్పినట్టు చెన్నారెడ్డి చందాల రెడ్డి అయితే మరి అతని వారసులు ఎవరు కూడా వేల కోట్లకు ఎదగలేదు. అంతేకాకుండా కోట్ల విజయభాస్కర్ రెడ్డిని అవినీతిపరుడంటూ రామోజీరావు అప్పట్లో రాతలు రాసి భ్రష్టు పట్టించారు. ఒకవేళ అదే నిజమైతే విజయభాస్కర్ రెడ్డి చివరి దశలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు బిల్లులు కట్టేందుకు డబ్బులు లేక సొంత ఇల్లు నే అమ్ముకున్నాడు. పి జనార్దన్ రెడ్డిని కబ్జాదారుడుగా చిత్రీకరిస్తూ అడ్డగోలుగా రామోజీరావు వార్తలు రాశాడు.. ఒకవేళ జనార్దన్ రెడ్డి కబ్జాదారుడైతే జూబ్లీహిల్స్ లో అంత పెద్ద పెద్దమ్మ గుడి ఎందుకు కట్టిస్తాడు? జనార్దన్ రెడ్డి పిల్లలు ఇప్పుడేమైనా కబ్జాలు చేసిన ఎస్టేట్లో ఉంటున్నారా? జనార్దన్ రెడ్డి అప్పట్లో అక్రమంగా కట్టిన ఐమాక్స్ థియేటర్ మీద పోరాడాడు. ఆ ఐమ్యాక్స్ థియేటర్ ఓనర్ సొంతకులపోడు కాబట్టి రామోజీరావుకు కోపం వచ్చింది. జనార్దన్ రెడ్డి మీద నేను పోనీ వార్తలు రాశాడు. జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఈనాడు విష ప్రచారం చేసింది.

ఉదయం లేస్తే సత్యహరిశ్చంద్రుడిలాగా వార్తలు రాసే రామోజీరావు.. విశాఖలోని సీతమ్మధారలో తాను నిర్మించిన ఈనాడు ఆఫీసు కోసం వ్యక్తి స్థలాన్ని ఆక్రమించాడు. ఎన్నో ఏళ్లుగా ఆ స్థానం కోసం ఆ వ్యక్తి పోరాడాడు. చివరికి వైయస్సార్ హయాంలో ఆ కుటుంబానికి విముక్తి లభించింది. విజయవాడలో ఈనాడు ఆఫీస్ పరిస్థితి కూడా అలాంటిదే. ఏకంగా రోడ్డుపైకి ఉంటుంది. దాన్ని ఒకవేళ కూల్చివేస్తే మీడియాపై దాడి అని నిర్లజ్జగా రాసేస్తుంది. అదేంటో గాని రామోజీరావు కేవలం ఒక వర్గానికి మాత్రమే మహానుభావుడు. అతడి చేతల్లో పలుమార్లు నిరూపించుకున్నాడు. ఇప్పుడు యూరీ రెడ్డి అనే వ్యక్తి కేసు పెడితే ఆయన కులానికి సంబంధించిన వ్యక్తులు రకరకాల అడిగి విసిగించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రామోజీరావుకు సొంత కులం సపోర్టు ఎలా ఉందో.. ఎప్పుడో జరిగితే ఇప్పుడు కేసు ఎందుకు పెడుతున్నారని వారు వాదిస్తున్న తీరు నవ్వు తెప్పించే విధంగా ఉంది.

రామోజీరావును బహిరంగంగా వెనకేసుకొచ్చే కొంతమంది జర్నలిస్టుల తీరు జనాలకు ఏవగింపు కలిగిస్తోంది. నేను తప్పు చేస్తాను.. ఆ హక్కు నాకుంది. నేను శిక్షలకు అతీతుడిని నేను శిక్షలకు అతీతుడిని అనే విధంగా రామోజీరావు వ్యవహార శైలి ఉందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా తెలుస్తున్నది. అమిత్ షా, జేపీ నడ్డా వచ్చినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైపులో కూర్చుని బిల్డప్ ఇచ్చే రామోజీరావు.. ఇవాళ యూరీ రెడ్డి కేసు పెట్టగానే ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయాడు. పైగా ఈ వ్యవహారం పట్ల జనం నుంచి సానుభూతి రాకపోవడంతో రామోజీరావు పతనం అంచిన నిలిచాడనే వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మార్గదర్శి కేసులో లుకలుకలు.. అన్నదాత మ్యాగజైన్ మూతపడింది. కొన్ని ఈటీవీ చానల్స్ కూడా అంబానీ చేతిలోకి వెళ్లిపోయాయి. ఫిలిం సిటీ కూడా లాస్ లో నడుస్తోంది. ఈటీవీ కూడా మూడవ స్థానానికి పడిపోయింది. చూస్తుంటే రామోజీరావుకు గ్రహచారం బాగోలేదు అనిపిస్తోంది.