https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కు టాలీవుడ్ నుంచి సన్మానం దక్కుతుందా?

అల్లు అర్జున్ గొప్ప విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు తెలుగు వారు గర్వించేలా చేశారు. అందుకే కచ్చితంగా టాలీవుడ్ ఆయనను సన్మానించాలని నెటిజన్ల కోరిక.

Written By: , Updated On : October 18, 2023 / 04:38 PM IST
Allu Arjun

Allu Arjun

Follow us on

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్స్, క్లాస్ మాస్ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కానీ పుష్ప సినిమాలో ఆయన నటనకు ఫిదా కాదు, ఆశ్చర్యపోవాల్సిందే. ఆ విధంగా ఆకట్టుకున్నారు మరీ బన్నీ. ఈయన నటనకు ఏకంగా జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లోనే అందుకున్నారు అల్లు అర్జున్. దీంతో ఇది మా పుష్ప రాజ్ అంటే అని ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

కానీ ఎందుకో ఇతర స్టార్లు, బన్నీ విజయాన్ని, దక్కిన గౌరవాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే హీరోగా మొదటి సారి అవార్డు అందుకున్నాడు బన్న. అంతే కాదు టాలీవుడ్ లోనే ఇది మొదటిసారిగా దక్కింది. అంటే ఇది బన్నీకి చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు కూడా జాతీయ అవార్డును అందుకోలేదు. ఈ గౌరవం బన్నీకి మొదటి సారి దక్కడంతో ఆయనకు కచ్చితంగా సన్మానం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అల్లు అర్జున్ గొప్ప విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు తెలుగు వారు గర్వించేలా చేశారు. అందుకే కచ్చితంగా టాలీవుడ్ ఆయనను సన్మానించాలని నెటిజన్ల కోరిక. గతంలో పద్మ అవార్డులను దక్కించుకున్న వారిని ఇండస్ట్రీ తరపున సన్మానించిన దాఖలాలు ఉన్నాయి.కనుక ఈసారి కూడా బన్నీకి అలాంటి సన్మానం జరగాల్సిన అవసరం ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. మరి చూడాలి అందరి కోరిక మేరకు టాలీవుడ్ నుంచి సన్మానం దక్కుతుందా లేదా అనేది.