https://oktelugu.com/

జగన్ కు మరో లేఖాస్త్రం సంధించిన ఎంపీ..

నర్సాపరం ఎంపీ, వైసీపీ నాయకులు రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రిపై లేఖల యుద్ధం కొనసాగిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పార్టీ పేరు విషయంలో వివాదం రాజేసి పార్టీకి కోర్టు నోటీసులు వెళ్లేవరకూ తీసుకొచ్ఛారు. అటు ఎన్నికల సంఘానికి, ఇటు జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు రక్షణ కల్పించే విషయంలో ఎపీ పోలీసులపై నమ్మకం లేదని మరో వివాదాన్ని గతంలోనే లేవనెత్తారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 14, 2020 / 07:56 PM IST
    Follow us on


    నర్సాపరం ఎంపీ, వైసీపీ నాయకులు రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రిపై లేఖల యుద్ధం కొనసాగిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పార్టీ పేరు విషయంలో వివాదం రాజేసి పార్టీకి కోర్టు నోటీసులు వెళ్లేవరకూ తీసుకొచ్ఛారు. అటు ఎన్నికల సంఘానికి, ఇటు జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు రక్షణ కల్పించే విషయంలో ఎపీ పోలీసులపై నమ్మకం లేదని మరో వివాదాన్ని గతంలోనే లేవనెత్తారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని కలిసి తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.

    ఇప్పుడు తాజాగా మరో అంశంపై ముఖ్యమంత్రికి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో 20.64 లక్షల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారిలో 10.66 లక్షల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని తెలిపారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో పన్నుల రూపంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రూ. 1,364 కోట్లు వసూలు చేసి సంక్షేమ నిధిలో జమ చేసిందన్నారు. ఈ మొత్తంలో ఇప్పటి వరకూ రూ. 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ.5 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.

    వైసీపీ ఎంపీ రఘురామ అసమ్మతి వెనుక అంతపెద్ద కథా?

    కొద్ధి రోజుల కిందట ఆయన సామాజిక ఫించన్ల విషయంలో లబ్ధిదారుల ఎంపికకు కనీస వయస్సును కుదిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో అవ్వా, తాతలు ఇప్పటి వరకూ రూ.15 వేలకు పైగా నష్టపోయారని లేఖలో రాశారు. షోకాజ్ నోటీసు అందిన అనంరతం నుంచి ఎంపీ రాఘురామకృష్ణంరాజు లేఖల సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ లేఖలపై ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. అయినప్పటికీ ఎంపీ మాత్రం లేఖలు రాస్తూనే ఉన్నారు.

    మరోవైపు ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ఎంపి రఘురామ కృష్ణంరాజు దిగిన సెల్పీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్ధరు నేతలు ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించినవారే కావడం, వీరిద్ధరు కలిసి సెల్పీ దిగడం పార్టీ ఫాలోవర్స్ మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ తనపై లోక్ సభ స్పీకర్ కు ఇచ్చిన అనర్హత పిటీషన్ వల్ల తనకు ఎటువంటి నష్టం ఉండదనే ధైర్యంతో ఎంపీ ఉన్నారు. తనపై అనర్హత వేటుకు ఏ మాత్రం ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నారు.