వ్యాక్సిన్ వచ్చేవరకు ఆ ట్రీట్మెంటే దిక్కా?

దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో చాలా రాష్ట్రాల ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీవైపు మొగ్గు చూపుతున్నారు. మహరాష్ట్ర, ఢిల్లీలాంటి రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్లాస్మా దానం చేసేందుకు వీలుగా సేకరణ కేంద్రాలను నెలకొల్పారు. కోవిడ్-19 కేసులలో సాధారణ చికిత్సకు కోలుకోని రోగులకు ప్లాస్మా థెరపీ వాడొచ్చని డాక్టర్లకు సూచిస్తున్నారు. కరోనావైరస్‌ కు ప్లాస్మా థెరపీ పనిచేస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచంవ్యాప్తంగా అనేక పరిశోధనలు […]

Written By: Neelambaram, Updated On : July 14, 2020 8:25 pm
Follow us on


దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో చాలా రాష్ట్రాల ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీవైపు మొగ్గు చూపుతున్నారు. మహరాష్ట్ర, ఢిల్లీలాంటి రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్లాస్మా దానం చేసేందుకు వీలుగా సేకరణ కేంద్రాలను నెలకొల్పారు.

కోవిడ్-19 కేసులలో సాధారణ చికిత్సకు కోలుకోని రోగులకు ప్లాస్మా థెరపీ వాడొచ్చని డాక్టర్లకు సూచిస్తున్నారు. కరోనావైరస్‌ కు ప్లాస్మా థెరపీ పనిచేస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచంవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. అయితే ఈ అధ్యయనాలనుబట్టీ కచ్చితంగా ఒక నిర్థరణకు రావడం కష్టమే. కోవిడ్-19 కేసులకు ఈ చికిత్స కచ్చితంగా పనిచేయదు అని చెప్పలేము, అలాగని ఈ చికిత్సను కొట్టిపారేయలేము అని డాక్టర్లు అంటున్నారు.

“ఇటువంటి అధ్యయనాలకు దీర్ఘకాలికంగా క్లినికల్ ట్రయిల్స్ జరగాలి. ఎక్కువ వైవిధ్యం ఉన్న పెద్ద పెద్ద సమూహాల మీద ట్రయల్స్ జరపాలి. తద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుని ఒక నిర్థరణకు రావాల్సి ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.. చైనాలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్ సత్ఫలితాలనిచ్చాయి. అయితే ఈ ట్రయల్స్‌ లో రోగులకు ప్లాస్మా చికిత్సతోపాటూ వేరే చికిత్సలు కూడా అందించారు.

అయితే ఇండియాలో మాత్రం ప్లాస్మా థెరపీ కచ్చితంగా పనిచేస్తుందని బలంగా నమ్ముతున్నారు. దీని గురించి రాజకీయ నాయకులు కూడా చురుకుగా ప్రచారం చేస్తుండడంతో డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీని గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్లాస్మా చికిత్స కచ్చితంగా పనిచేస్తుందనే నమ్మకం ప్రజల్లో బలపడిపోతోంది. కానీ ఈ చికిత్స ఎవరికి అందించాలి అనేది వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు.