తెలుగు రాష్ట్రాలు కూడా అలా చేస్తేనే బాగుంటదేమో..?

భారత్‌ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు మళ్లీ లాక్‌ డౌన్ విధిస్తున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ విధిస్తే.. బావుంటదని ఆ విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు […]

Written By: Neelambaram, Updated On : July 14, 2020 7:54 pm
Follow us on

భారత్‌ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు మళ్లీ లాక్‌ డౌన్ విధిస్తున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ విధిస్తే.. బావుంటదని ఆ విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గతంలో సంపూర్ణ లాక్‌ డౌన్‌ కు కేసీఆర్ సర్కార్ మొగ్గు చూపినప్పటికి చివరి నిమిషంలో విరమించుకున్నారు. ఆంధ్రాలో కూడా జగన్ సర్కార్ లాక్ డౌన్ నిర్ణయంపై స్పష్టత లేదు. కానీ బీహార్ లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఈ నెలాఖరు వరకు మూసివేయాలిని, ప్రార్థనా మందిరాలకు భక్తులను అనుమతించకూడదని, వ్యవసాయ, నిర్మాణ రంగ పనులకు అనుమతి ఉంటుందని నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక కేవలం నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని సుశీల్ మోడీ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ తరహా లాక్ డౌన్ విధించినట్లయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చని పలువురు సూచిస్తున్నారు.

మరోవైపు మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళనాడు గుజ‌రాత్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో దేశంలో నమోదవుతున్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 86 శాతం కేసులు పది రాష్ట్రాల నుంచే ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. దాదాపు 50 శాతం పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేకాధికారి రాజేష్‌ భూషణ్ చెప్పారు. మిగ‌తా ఎనిమిది రాష్ట్రాల్లో 36 శాతం కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షలు దాటింది.  గడచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా  బాధితుల సంఖ్య  9,06,752కు పెరిగింది.  ప్రస్తుతం  3,11,565  మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ  5,71,460 మంది  కోలుకున్నారు.