AP PRC: పీఆర్సీ లొల్లి.. వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తింపు

AP PRC: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు తీపి కబురు అందుతోంది. పీఆర్సీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొత్త పీఆర్సీతో తమ బతుకులు మారతాయని భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏ మేరకు స్పందించనుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది. రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. […]

Written By: Srinivas, Updated On : December 15, 2021 10:39 am
Follow us on

AP PRC: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు తీపి కబురు అందుతోంది. పీఆర్సీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొత్త పీఆర్సీతో తమ బతుకులు మారతాయని భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏ మేరకు స్పందించనుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

AP PRC

రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం పీఆర్సీ సచివాలయాల ఉద్యోగులకు వర్తించే అవకాశం ఏర్పడిందని తెలుస్తోంది. కానీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి కూడా పీఆర్సీ వర్తింపజేయాలని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.

గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శులకు రూ.15 వేలు వేతనంగా ఇస్తున్నారు. దీంతో వారికి రూ. 46 వేలు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో వారికి కూడా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి పీఆర్సీ నివేదిక ప్రకారం వేతనాలిస్తే ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయని తెలుస్తోంది. కానీ ప్రభుత్వం ఈ మేరకు స్పందిస్తుందో లేదో చూడాల్సిందే.

Also Read: YS Sharmila: రైతుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా? షర్మిల సూటి ప్రశ్న

పీఆర్సీ సిఫార్సుల ప్రకారం ప్రొబేషనరీ ప్రకటన పూర్తయిన వారికి మాత్రమే ఈ సిఫార్సులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉద్యోగుల ఆశలు నెరవేరే సూచనలు కనిపిస్తాయో లేదో తేలడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

Also Read: Movie Ticket Prices: టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసిన హైకోర్టు!

Tags