https://oktelugu.com/

Natural Star Nani: ఈ క్రిస్మస్ “శ్యామ్ సింగరాయ్” దే అంటున్న నాని…

Natural Star Nani: విభిన్న చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరో నాని. వరుస సినిమాలు చేస్తూ నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక నాని ప్రస్తుతం “శ్యామ్ సింగరాయ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రాయల్ ఈవెంట్ ను వరంగల్‌లోని రంగలీల మైదానంలో నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. […]

Written By: , Updated On : December 15, 2021 / 10:48 AM IST
Follow us on

Natural Star Nani: విభిన్న చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరో నాని. వరుస సినిమాలు చేస్తూ నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక నాని ప్రస్తుతం “శ్యామ్ సింగరాయ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రాయల్ ఈవెంట్ ను వరంగల్‌లోని రంగలీల మైదానంలో నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు పాత్రలలో నాని డ్యుయల్ రోల్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్ లు గా నటించారు. ఇదిలా ఉండగా ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నాని మాట్లాడుతూ… ఒక మంచి సినిమా చేశాక మనసులో నిండు గర్వం కనిపిస్తుందని అన్నారు. శ్యామ్ సింగరాయ్ చేశాక తనకు అలాంటి అనుభూతులే కలిగాయని, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా బయటకు వెళతారని అన్నారు.

Natural Star Nani

natural star nani speech at shyam singaroy royal event at warangal

Also Read: ఇంపాజిబుల్ సిచ్యువేషన్స్‌లో పోర్న్ చూస్తా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

సిరివెన్నెల ఈ సినిమాలో దేవి పై అద్భుత మైన పాట రాశారని అన్నారు. కీర్తి పాత్రలో కృతి శెట్టి అద్భుతంగా నటించింది అని నాని చెప్పారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం… మ్యూజిక్‌ ఉన్నంత కాలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జీవించే ఉంటారు. ఆయన ఆఖరి పాట మా ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో ఉండటం వల్ల ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారిపోయిందన్నారు నాని. దేవీ మీద రాసిన పుస్తకాలన్నీ 45రోజుల పాటు చదివి ఆ పాట రాశానని శాస్త్రి గారు చెప్పారు. దేవీ పాటలో సాయిపల్లవి డ్యాన్స్‌ మరింత ఆకట్టుకుంటుంది. నిర్మాత వెంకట్‌తో నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు.. ఇంకా సుదీర్ఘంగా సాగుతుంది. ఈ చిత్రంతో ఎడిటర్‌ నవీన్‌ నూలి మరో నేషనల్‌ అవార్డు అందుకుంటాడని ఆశిస్తున్నా. అద్భుతమైన సెట్స్‌ వేసిన అవినాష్‌కు థ్యాంక్స్‌. అందరి కష్టంతోనే ఇలాంటి చిత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాం. గర్వంగా చెబుతున్నా ఈ క్రిస్మస్‌ మనదే అన్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించగా… సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా హీరోయిన్లు గా నటించారు. డిసెంబర్ 24 న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు