BCCI gave clarity: టీంఇండియా విషయంలో బీసీసీఐ తీసుకున్న కీలక నిర్ణయం వివాదానికి కారణమైందా? అంటే అంతా అవుననే సమాధానమే వస్తోంది. టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని, వన్డే జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేయడంతో ఇరువురి మధ్య విబేధాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తనతో మాటమాత్రం కూడా చెప్పకుండా బీసీసీఐ వన్డే కెప్టెన్ గా తప్పించడంపై విరాట్ కోహ్లీ గుర్రుగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే అతడు బీసీసీఐ బోర్డు సభ్యులకుగానీ, జట్టులోని సభ్యులకుగానీ అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది.
రోహిత్ శర్మ వన్డే కెప్టెన్ గా ఎంపికవగా విరాట్ కోహ్లీ కనీసం శుభాకాంక్షలు కూడా తెలుపలేదు. అలాగే బీసీసీఐ ఇటీవల ముంబై నిర్వహించిన సమావేశానికి విరాట్ కోహ్లీ గైర్హజరయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ఆటగాళ్లంతా మూడ్రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. అయితే కోహ్లీ జట్టులో కలువకపోవడంతో అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతాడా? లేడా అన్న సందిగ్ధత నెలకొంది.
ఇలాంటి నేపథ్యంలోనే టెస్టు సిరీసు నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడం జట్టులో విబేధాలు ఉన్నాయనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రాక్టీసు మ్యాచులో తొడకండరాలు పట్టేయడంతో అతడు టెస్టు సిరీసుకు దూరంగా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే వన్డే సిరీసుకు అందుబాటులో వస్తాడని ప్రకటించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. రోహిత్ శర్మ గాయంతోనే టెస్టు సిరీసు నుంచి తప్పుకున్నాడా? లేక కోహ్లీతో విబేధాల కారణంగా తప్పుకోవాల్సి వచ్చిందా? అన్న చర్చ అభిమానుల్లో నడుస్తోంది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీంఇండియా న్యూజిల్యాండ్ జట్టుతో ఆడించింది. టీ20కి విరాట్ కోహ్లీని, టెస్ట్ కు రోహిత్ శర్మకు విశ్రాంతిని ఇచ్చింది. అయితే తొలి టెస్ట్ కు విరాట్ అందుబాటులోకి రాలేదు. సెకండ్ టెస్టులో విరాట్ కోహ్లీగా పాల్గొనగా ఆ మ్యాచులో భారత్ భారీ విజయం దక్కించుకొని 1-0తో సిరీసును కైవసం చేసుకుంది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన టెస్ట్, వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది.
వన్డే జట్టుకు రోహిత్ శర్మ, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా ప్రకటించింది. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్ గా ఎంపికైన తర్వాత నుంచి వీరిద్దరు కలుసుకోలేదు. దీనికితోడు దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గాయంతో ఈ సిరీసుకు దూరయ్యాడు. ఇదే క్రమంలో వన్డే సిరీసుకు కోహ్లీ సైతం దూరంకానున్నడనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో బీసీసీఐ స్పందిస్తూ విరాట్ కోహ్లీ వన్డే జట్టులో ఆడుతాడని స్పష్టం చేసింది.
Also Read: కోహ్లీ పోయిండు.. రోహిత్ గాయం.. ఇప్పుడు జడేజా కూడా బీసీసీఐకి షాక్
విరాట్ కోహ్లీకి విశ్రాంతి కావాలనుకుంటే బీసీసీఐ కార్యదర్శిని కోరేవాడని, కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ జరుగలేదని పేర్కొంది. దీంతో అతడు వన్డే సిరీసులో ఆడుతున్నట్లే లెక్క అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. నిజంగా అతడు విశ్రాంతి కోరితే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక కోహ్లీ కూతురు తొలి పుట్టిన రోజు జనవరి 11న ఉంది. ఈనేపథ్యంలోనే అతడు వన్డే సిరీసుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ విన్పిస్తోంది. అయితే వన్డే సిరీసు జనవరి 19 నుంచి ప్రారంభం కానుండటంతో విరాట్ కోహ్లీ జట్టుకు దూరమయితే మాత్రం వీరిమధ్య విభేదాలు నిజమేనని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: రోహిత్ వైదొలిగాడు.. కోహ్లీ నా వల్ల కాదన్నాడు.. టీమిండియా పరిస్థితేంటి?