https://oktelugu.com/

బెజవాడ గ్యాంగ్ లపై పోలీసుల కీలక నిర్ణయం..!

విజయవాడ నగర పోలీసులు గ్యాంగ్ వార్ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సందీప్, పండు రెండు గ్యాంగ్ ల సభ్యులకు నగర బహిష్కరణ దండన విధించారు. ఈ మేరకు డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో సందీప్, పండు గ్యాంగ్ ల మధ్య జరిగిన కొట్లాటలో సందీప్ మృతి చెందగా మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ రెండు గ్యాంగ్ ల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని పోలీసులు అరెస్టు […]

Written By: , Updated On : June 15, 2020 / 12:23 PM IST
Follow us on


విజయవాడ నగర పోలీసులు గ్యాంగ్ వార్ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సందీప్, పండు రెండు గ్యాంగ్ ల సభ్యులకు నగర బహిష్కరణ దండన విధించారు. ఈ మేరకు డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో సందీప్, పండు గ్యాంగ్ ల మధ్య జరిగిన కొట్లాటలో సందీప్ మృతి చెందగా మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ రెండు గ్యాంగ్ ల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చున్న భట్టు నాగబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా గ్యాంగ్ వార్ కేసులో ఇప్పటి వరకూ 37 మందిని అరెస్టు చేశారు.

ఈ కేసులో ఇప్పటి వరకు పండు గ్యాంగ్‌కు 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని వీరిలో ఉన్నారు. పరారీలో ఉన్న మరో 13 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసులు తాజాగా అరెస్టు చేసిన పండు, నాగబాబు, ప్రదీప్‌రెడ్డి లను కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో గ్యాంగ్ ల విష సంస్కృతి నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భావించిన క్రమంలో ఈ రెండు గ్యాంగుల సభ్యులను విజయవాడ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు డీసీపీ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడినా, గ్యాంగ్ లను నిర్వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు.