Pawan Kalyan:నవ్యాంధ్ర ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి పాలకులు తీసుకొచ్చారని అటు జగన్ ను.. ఇటు చంద్రబాబును కలిపి ఉతికేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ పలు రాష్ట్రాలను ఉదాహరణగా చూపించి చిలకపలుకులు పలుకుతున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు లేవన్న విషయాన్ని విస్మరించారని పవన్ మండిపడ్డారు.
ఇక జగన్ సర్కార్ మూడు రాజధానుల ఉపసంహరణ కేవలం హైకోర్టు నుంచి తప్పించుకోవడానికేనని పవన్ ఎద్దేవా చేశారు. కొత్త బిల్లులు తెస్తామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ఆరోపించారు.
రాజధాని అమరావతిపై 54 కేసులపై హైకోర్టులో చురుకుగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించి తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకునేందుకే బిల్లులు రద్దుకు జగన్ ఉపక్రమించారని పవన్ లాజిక్ బయటకు తీశారు. కోర్టు తీర్పుతో అసలు మూడు రాజధానులకు చెక్ పడుతుందనుకుంటున్న సమయంలో జగన్ కొత్త నాటకానికి తెరతీశాడని అన్నారు.
Also Read: AP 3 Capitals: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం
ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు లేవని.. అన్ని రాష్ట్రాలను ఉదాహరణగా చూపించిన వైసీపీ పెద్దలు ఎందుకు భ్రమల్లో బతుకుతున్నారని పవన్ కాస్తా గట్టిగానే గడ్డిపెట్టేశాడు. 33వేల ఎకరాలు పంచిన అమరావతి రైతులకే తాము బాసటగా నిలుస్తామని.. వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ సంచలన ప్రకటన చేశారు.
Also Read: AP CM Jagan: ఏపీలో వరద.. సీఎం జగన్ పెళ్లిళ్లలో సరదా?