Manchu Lakshmi: మంచు కుటుంబం నుంచి హీరోలతో పాటు మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చారు మంచి లక్ష్మి ప్రసన్న. హీరోయిన్ గానే కాకుండా విలన్ గానూ నటించి మెప్పించింది మంచు లక్ష్మి. మొదటగా సిద్దార్డ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో మంత్రగత్తెగా నటించి ఆకట్టుకున్నారు లక్ష్మి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. సినిమాల తోనే కాకుండా టీవీ షోలతో, టాక్ షోలతోనూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ భామ. అయితే ఈ మధ్య సినిమాలకు కొంత దూరంగా ఉంటున్నారు లక్ష్మి. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మంచు లక్ష్మి. నిత్యం సినిమా అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అలానే కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు లక్ష్మి. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ నటించి మెప్పించారు ఈమె. అయితే తాజాగా లక్ష్మి మలయాళంలోకి ఎంట్రీ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీనే అధికారికంగా ప్రకటించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా ‘మాన్‌స్టర్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్‌లాల్ లక్కీ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం లక్ష్మి ఇందులో మోహన్ లాల్‌కు భార్యగా కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.