Homeఎంటర్టైన్మెంట్Cauli Flower Movie: సంపూర్ణేష్ బాబు కి అండగా విక్టరీ వెంకటేష్... క్యాలి ఫ్లవర్ మూవీ...

Cauli Flower Movie: సంపూర్ణేష్ బాబు కి అండగా విక్టరీ వెంకటేష్… క్యాలి ఫ్లవర్ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్

Cauli Flower Movie: సంపూర్ణేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. హృదయ కాలేయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు మన బర్నింగ్ స్టార్. సంపూ ప్రస్తుతం ఆర్కే మలినేని దర్శకత్వంలో… వాసంతి హీరోయిన్ గా  ‘క్యాలీఫ్లవర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మధు సూధన క్రియేషన్స్, రాధా కృష్ణ టాకీస్ పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అండగా నిలిచారు.

victory venkatesh supports sampoornesh babu cauli flower movie

అయితే తాజాగా ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెంకటేష్ ఒక పోస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రం నవంబర్ 26 వ తేదీన విడుదల కానుంది. కరోన నేపధ్యం తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల ఇంకా కొంత మంది సినిమా థియేటర్లకు వచ్చేందుకు వెనుకడుతున్నారు. ఈ తరుణంలో సంపూకి వెంకటేష్ అండగా నిలవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనదైన కామెడీ తో అందర్నీ ఆకట్టుకునే సంపూ ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version