Pak -Turkey : పాముకు పాలు పోస్తే ఏం చేస్తుంది? పాలు పోసిన చేతినే కాటు వేస్తుంది. అది దాని నైజం కూడా.. పాకిస్తాన్ కూడా అలాంటి దేశమే. సాయం చేసిన వారి వినాశనాన్ని కోరుకునే టైపు.. ఓ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్, అరబ్ కంట్రీస్… ఇలా ఏ ముస్లిం దేశం తీసుకున్నా పాకిస్తాన్ మీద కారాలు, మిరియాలు నూరుతాయి. ఎందుకంటే ఆ దేశం వల్ల అవి పడిన ఇబ్బందులు అలాంటివి మరి.
తాజాగా పాకిస్తాన్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది.. పాకిస్తాన్ వార్తల్లో ఉండంది ఎప్పుడూ అని అంటారా? అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ తన మిత్ర దేశమైన టర్కీకి నిత్యావసర సరుకులను పంపింది. దీనిపై అన్ని దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ టర్కీకి పాకిస్తాన్ సహాయం చేయడాన్ని గొప్పగా అభివర్ణించాయి..కానీ ఇక్కడే అసలు విషయం బయటపడింది.
ఆ మధ్య పాకిస్తాన్లో వరదలు వచ్చినప్పుడు ఆ దేశానికి అండగా ఉండేందుకు టర్కీ ముందుకు వచ్చింది.. నిత్యావసరాలతో కూడిన కిట్లను ఆ దేశానికి పంపింది. పాకిస్తాన్ ప్రజల కోసం టర్కీ అందిస్తున్న సహాయం అని ఆ కిట్ పెట్టేల మీద రాసి పంపింది.. కానీ ఆ కిట్లను వాడుకోని పాకిస్తాన్ ఇప్పుడు వాటిని టర్కీకి యధావిధిగా పంపింది.. పెట్టెల మీద మాత్రం టర్కీ ప్రజల కోసం పాకిస్తాన్ అందిస్తున్న విరాళం అని రాసింది.. కానీ లోపల మాత్రం టర్కీ రాసిన రాతలు అలాగే ఉన్నాయి. ఈ పెట్టెలను స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి పర్యవేక్షించడం గమనార్హం..
కాగా పాకిస్తాన్ చేసిన పనికి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మేమ్స్ చెలరేగుతున్నాయి. కాగా టర్కీలో వచ్చిన భూకంపానికి ఇప్పటివరకు 50,000 మంది దాకా చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.. ఇక టర్కీ కోసం ప్రపంచ దేశాలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. భారత్ ఆర్థిక సహాయంతో పాటు వివిధ రకాలైన వస్తువులను అక్కడికి పంపింది. ఇక్కడ నుంచి వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపింది.. భారత్ చేసిన సహాయానికి టర్కీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. అదే ఇన్నాళ్లు తాను మిత్ర దేశం అనుకున్న పాకిస్తాన్ అసలు బుద్ధి చూపించడంతో టర్కీకి జ్ఞానోదయం అయింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Pak sends repackaged turkish flood aid as earthquake relief to turkey
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com