Madin India Products: అలుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు. మాట తూటా కంటే బలమైంది. తూటా అయినా వెనక్కి తీసుకోవచ్చు. కానీ మాట మాత్రం తీసుకోవడం కష్టమే. అందుకే మనం నోరు జారితే చాలా ప్రమాదాలు ఉంటాయి. మాట్లాడే మాటలు ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైనా నోరు విప్పితే జరిగే పర్యవసానాల గురించి ఆలోచించి మాట్లాడాలి. అంతే కాని మనకు నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తరువాత మనకే నష్టం జరగొచ్చు. మొదట ఎదుటి వ్యక్తి చెప్పేది వినాలి. తరువాత మనం మాట్లాడాలి. అప్పుడే మాటల్లో తేడాలు ఉండవు. అంతే కాని మనం మాట్లాడేది మాట్లాడితే తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

బీజేపీ నేతలు మాట్లాడిన మాటలతో ఇప్పుడు దేశానికి ముప్పు ఏర్పడుతోంది. ఇతర దేశాల్లో మేడిన్ ఇండియా ఉత్పత్తులను రానీయడం లేదు. వాటిని పక్కన పడేస్తున్నారు. దీంతో మన వ్యాపార వ్యవహారాలు దెబ్బతినే ప్రమాదముంది. బీజేపీ నేతలు ప్రవక్త విషయంలో నోరు జారారని అభియోగం. దీంతో అంతర్గత వ్యవహారాలు కాస్త అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా దేశం సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Ram Charan Driver Birthday Celebrations: రామ్ చరణ్ గొప్పోడబ్బా… డ్రైవర్ కోసం ఏం చేశాడో చూడండి!
దీనికి బీజేపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నా ఆయా దేశాలు విశ్వసించడం లేదు. అలా మాట్లాడిన నేతలను పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఖతర్ దేశంలో సూపర్ మార్కెట్లలో ఉన్న ఇండియా ఉత్పత్తులను బజారులో పడేశారు. ఇలా అన్ని దేశాలు మూకుమ్మడిగా బహిష్కరిస్తే ఇండియాకు తిప్పలు తప్పవని తెలుస్తోంది. ఇంకా పెట్రో దిగుమతులపై ఆంక్షలు విధిస్తే పెట్రో సంక్షోభం తలెత్తి ఇండియా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

బీజేపీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తున్నామని చెబుతున్నా వారు విశ్వసించడం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలకు భారత్ సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఎవరో చేసిన తప్పులకు మరెవరో బాధ్యత వహించాల్సి రావడం అంటే ఇదేనేమో. మొత్తానికి అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలపై భారత్ తనదైన శైలిలో జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read:Hyper Aadi Arrested: హైపర్ ఆది అరెస్ట్… షో జరుగుతుండగానే లాక్కెళ్లిన పోలీసులు!
[…] Also Read: Madin India Products: మేడిన్ ఇండియా ఉత్పత్తులు బ్య… […]
[…] Also Read:Madin India Products: మేడిన్ ఇండియా ఉత్పత్తులు బ్య… […]
[…] Also Read: Madin India Products: మేడిన్ ఇండియా ఉత్పత్తులు బ్య… […]