Vastu Tips- Financial Problems: ప్రతి మనిషి తన జీవితంలో ఓ అందమైన ఇల్లు కట్టుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఉన్నదాంట్లో తృప్తిగా జీవించాలని కూడా కలలు కంటుంటాడు. ఇందులో బాగంగానే వచ్చే సంపాదనతో ఖర్చులు పోను కొంత మొత్తాన్ని జమ చేసి భవిష్యత్ లో ఖర్చులకు ఉపయోగించుకోవాలని చూస్తుంటాడు. కానీ ఇటీవల కాలంలో పెరిగిన ధరలతో ఆదాయం సరిపోవడం లేదు. దీంతో ఇంటికి వాస్తు దోశం ఉందని పలువురు తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా వాస్తు పండితులనే తీసుకొచ్చి తమ దుస్థితికి కారణాలేంటని ఆరా తీస్తారు. ఈ నేపథ్యంలో వాస్తు ప్రభావంతోనే ఇలా జరుగుతుందని పరిహారాలు కూడా చేస్తారు.

మన ఇంట్లో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా లక్ష్మీదేవి నిలవదట. మన ఇంట్లో ఉండే నల్లా నుంచి నీరు నిరంతరం కారుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరంగా ఉండదట. నీరును వృథా చేసే ఏ ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండదని తెలిసిందే. దీంతో ఇంట్లో ఎక్కడ కూడా నీరు లీకేజీ కాకుండా చూసుకోవాలి. పైపుల ద్వారా అయినా భూమిలోనైనా నీరు లీకేజీ ఉంటే అంతా బురదమయంగా ఉంటుంది. అందుకే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండకుండా వెళ్లిపోతుంది. అందుకే మనం నీటిని వృథా చేయడం చెడ్డ అలవాటే అని తెలుసుకుంటే మంచిది.
Also Read: Madin India Products: మేడిన్ ఇండియా ఉత్పత్తులు బ్యాన్
ఇంట్లో పావురం గూడు పెట్టుకుంటే కూడా అరిష్టమే. ఈ విషయం చాలా మందికి తెలియదు. పావురం గూడు పెట్టుకుంటే దానికి మంచిదే కానీ మన ఇంటికి మాత్రం దోషమే. దీంతో ఎప్పుడైనా మన ఇంట్లో పావురం గూడు ఉండకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు కూలర్లలో కూడా పావురాలు గూళ్లు పెడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో అవి గూడు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మనకు దోషం పట్టి ఎదుగుదల లేకుండా చేస్తుంది.

ఇంట్లో ఎప్పుడు తడిగా ఉంటే కూడా నష్టమే. ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తే తడిగా ఉంటుంది. దీంతో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇల్లు ఎప్పుడు కూడా తడిగా ఉండరాదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదట. అందుకే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. నీరు పారకుండా చూసుకుంటే మంచిది. ఇంట్లో నీరు ప్రవహించినట్లే డబ్బు కూడా నిలువ ఉండకుండా అలాగే అవుతుందని విశ్వాసం.
ఈ జాగ్రత్తలు పాటించి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండేందుకు చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఇంట్లో ఏది కూడా స్థిరంగా ఉండదు. అందుకే పై జాగ్రత్తలు తీసుకుని లక్ష్మీదేవి ఇంట్లో ఉండేలా అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. వాస్తు దోషం లేకుండా చేసుకుంటేనే లక్ష్మీదేవి నివాసం ఉండి మనకు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలుంటాయి. గృహస్తులు జాగ్రత్త. వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి.