Ram Charan Driver Birthday Celebrations: ఓ టాప్ స్టార్ తన డ్రైవర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తాడంటే నమ్మడం కష్టం. సెలెబ్రిటీలు, ప్రముఖులు తమ వద్ద పనిచేసే సిబ్బందితో చనువుగా ఉండరు. రామ్ చరణ్ లాంటి హీరోలు అందుకు భిన్నం. రామ్ చరణ్ చేసిన ఓ పని ప్రశంసలు అందుకుంటుంది. అంత పెద్ద స్టార్ హీరో తన డ్రైవర్ కోసం ఇంత చేశాడా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. నరేష్ అనే వ్యక్తి చాలా కాలంగా హీరో రామ్ చరణ్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్ ని కేవలం డ్రైవర్ గా కాకుండా సొంత మనిషిగా రామ్ చరణ్ భావిస్తారట.

కాగా నరేష్ పుట్టినరోజు అని తెలుసుకున్న రామ్ చరణ్ అతని బర్త్ డే సెలబ్రేట్ చేశారు. అతనితో కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. ఈ బర్త్ డే పార్టీలో చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొనడం విశేషం. ఈ సెలబ్రిటీ కపుల్ తమ డ్రైవర్ బర్త్ డే దగ్గరుండి జరిపారు. ఈ కార్యక్రమంలో చరణ్ మిగతా సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ మంచి మనసును పలువురు కొనియాడుతున్నారు. ఇక సదరు డ్రైవర్ కి రామ్ చరణ్ నెలకు రూ. 45 వేలు జీతంగా ఇస్తున్నారట.
ఇలాంటి మంచి పనులతో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తూ, కొందరు హీరోలు తమ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ హిట్ కొట్టారు. వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ, ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. యూఎస్ లో రీ రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. హాలీవుడ్ వర్గాల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చరణ్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న మూవీ సెట్స్ పై ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని పిక్స్ లీక్ కాగా, చరణ్ లో లుక్ ఆసక్తి రేపుతోంది. దిల్ రాజు పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ రామ్ చరణ్ కి జంటగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2023లో విడుదల కానుంది. ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.
Also Read:Hyper Aadi Arrested: హైపర్ ఆది అరెస్ట్… షో జరుగుతుండగానే లాక్కెళ్లిన పోలీసులు!
[…] Also Read: Ram Charan Driver Birthday Celebrations: రామ్ చరణ్ గొప్పోడబ్బా… […]
[…] Also Read: Ram Charan Driver Birthday Celebrations: రామ్ చరణ్ గొప్పోడబ్బా… […]